న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమ్మా ఈ ట్రోఫీ నీదే.. తమిళనాడు క్రికెటర్ భావోద్వేగం!

Murugan Ashwin says ‘This Syed Mushtaq Ali trophy is for you, thank you Amma’

అహ్మదాబాద్‌: ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని కనబర్చిన తమిళనాడు క్రికెట్‌ జట్టు దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బరోడాతో ఆదివారం జరిగిన ఫైనల్లో దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని తమిళనాడు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టోర్నీ ప్రారంభమైన 2007లో టైటిల్‌ గెల్చుకున్న తమిళనాడు మళ్లీ 14 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా నిలిచింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా తమిళనాడు, బరోడా ఫైనల్‌ చేరగా... తుది పోరులో తమిళనాడుదే పైచేయిగా నిలిచింది. అయితే ఈ విజయాన్ని ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్.. మరణించిన తన తల్లికి అంకితమిచ్చాడు.

మా అమ్మవల్లే క్రికెట్..

అనారోగ్యంతో తన తల్లి గత నెలలో మరణించగా.. ఆమెను తలుచుకుంటూ ఈ 30 ఏళ్ల సీనియర్ స్పిన్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్‌స్టా వేదికగా తన తల్లితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సుదీర్ఘ లేఖతో తన తల్లికి నివాళులర్పించాడు.'నెలక్రితం తీవ్ర అనారోగ్యం మా అమ్మ మరణించింది. ఆమెను కాపాడుకోవడం కోసం మేం చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. మా అమ్మకు క్రికెట్ అంటే పిచ్చి. ఆమె ఇష్టం కారణంగానే నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. డజన్ల కొద్ది రబ్బర్, టెన్నిస్, క్రికెట్ బాల్స్ నా చిన్నతనంలో మా అమ్మ కొనుగోలు నా కోసం తెచ్చేది. ఆ బాల్స్‌తో నేను ఆడుకునేవాడిని. అలా క్రమంగా నాకు క్రికెట్‌పై మక్కువ పెరిగింది.

 నా కోసం అమ్మ..

నా కోసం అమ్మ..

నా ఆట మెరుగవ్వడం కోసం ఆమె చాలా కష్టపడింది. నా కోసం చాలా టైమ్ కేటాయించేది. మ్యాచ్‌లు ఆడేందుకు మా స్కూల్ నుంచి పర్మీషన్ తీసుకునేది. నాకు మంచి క్రికెట్ కూడా కొనిచ్చింది. ఉదయం నాలుగు గంటలకే లేచి అన్ని పనులు చేసేది. ఆమె నా అభిమాని, విమర్శకురాలు. నేను మంచి పర్ఫామెన్స్ కనబర్చాలే నన్ను ప్రోత్సహించేది. ఆమె అకాల మరణం తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని వదిలేద్దాం అనుకున్నా. కానీ జట్టులోని ఆటగాడిగా నా బాధ్యత గుర్తొచ్చి అయోమయానికి గురయ్యాను. అప్పుడు మా నాన్న, నా భార్య, సోదరి నేను టోర్నీలో కొనసాగాలని చెప్పారు. మా అమ్మ కోరిక కూడా అదేనని గుర్తు చేశారు.

 అమ్మా ఈ టైటిల్ నీదే..

అమ్మా ఈ టైటిల్ నీదే..

ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నీదే అమ్మా.. మైదానంలో అడుగుపెట్టిన ప్రతీసారి అమ్మను తలుచుకున్నాను. అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయానికి సాయపడాలనుకున్నాను. టోర్నీ గెలిచినందుకు మా అమ్మ గర్వంగా ఫీలయ్యి ఉంటుందని, నా ప్రదర్శన పట్ల సంతోషంగా కూడా ఉండి ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను తమిళనాడు తరఫున హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాను. థ్యాంక్యూ అమ్మ..!'అని అశ్విన్ ముగించాడు. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 10 వికెట్లతో సత్తా చాటాడు. ఇక గత సీజన్‌లో కింగ్స్ పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ఈ తమిళనాడు స్పిన్నర్‌ను.. అప్ కమింగ్‌ సీజన్‌కు కూడా ఆ జట్టు రిటైన్ చేసుకుంది.

 ఫైనల్లో ఆల్‌రౌండ్ షో..

ఫైనల్లో ఆల్‌రౌండ్ షో..

టాస్‌ గెలిచి తమిళనాడు ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బరోడా 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (49; ఫోర్, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తమిళనాడు బౌలర్‌ మణిమారన్‌ సిద్ధార్థ్‌ 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తమిళనాడు, 18 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి విజయం సాధించింది. హరి నిశాంత్‌ (35; 3 ఫోర్లు, సిక్స్‌), బాబా అపరాజిత్‌ (29 నాటౌట్‌; ఫోర్‌), దినేశ్‌ కార్తీక్‌ (22; 3 ఫోర్లు), షారుఖ్‌ ఖాన్‌ (18 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించారు

Story first published: Tuesday, February 2, 2021, 16:06 [IST]
Other articles published on Feb 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X