న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kumar Kartikeya: తొమ్మిదేళ్ల తర్వాత తల్లిని కలిసిన ముంబై ఇండియన్స్ స్పిన్నర్

 Mumbai Indians spinner Kumar Karthikeya meets his mother after 9 years

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌తో వెలుగులోకి వచ్చిన ముంబై ఇండియన్స్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తల్లిని కలిసాడు. ఈ సందర్భంగా కార్తీకేయ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అందరి సాధారణ క్రికెటర్లలనే కార్తీకేయ సైతం పరిస్థితులతో పోరాడాడు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి భారం కాకూడదని భావించిన కార్తికేయ.. 15 ఏళ్ల వయసులోనే ఇంటి (ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌) నుంచి బయటకు వచ్చాడు. క్రికెటర్ కావాలనే తన లక్ష్యం కోసం కార్తికేయ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన కోచింగ్ ఫీజులు తండ్రికి భారం కాకుడదనే కార్తీకేయ ఈ పని చేశాడు.

రూ.10 బిస్కెట్ కోసం 10 కిలోమీటర్ల నడక..

రూ.10 బిస్కెట్ కోసం 10 కిలోమీటర్ల నడక..

ఢిల్లీలో తనకు తెలిసిన స్నేహితుడితో అన్ని అకాడమీలు తిరిగాడు. కానీ ఫీజులు ఎక్కువగా ఉండటంతో చేరలేకపోయాడు. తన కోచ్ భరద్వాజ్ అకాడమీకి వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే భరద్వాజ్.. కార్తీకేయకు ఓ అవకాశం ఇచ్చాడు. నెట్స్‌లో అతనితో బౌలింగ్ చేయించాడు. అతని బౌలింగ్‌కు ఫిదా అయిన భరద్వాజ్ ఫ్రీగా కోచింగ్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. కోచింగ్ సమస్య తీరినా కార్తీకేయకు ఆహారం, వసతి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో అకాడమీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేస్తూ ఉదయం అకాడమీకి వచ్చేవాడు. రూ.10 బిస్కట్ ప్యాకెట్ కొనుక్కోని తినేందుకు అతను 10 కిలోమీటర్లు నడిచేవాడు.

ఢిల్లీలో అవకాశం రాకపోవడంతో..

ఢిల్లీలో అవకాశం రాకపోవడంతో..

ఈ విషయం తెలుసుకున్న భరద్వాజ్ అతనికి అకాడమీలోనే పనితో పాటు వసతి కల్పించాడు. అయితే తొలిసారి భోజనం పెట్టినప్పుడు కార్తీకేయ వెక్కి వెక్కి ఏడ్చాడని, ఏడాది కాలంగా అతను లంచ్ చేయలేదనే విషయం తనకు అప్పుడే తెలిసిందని భరద్వాజ్ ఈఎస్‌పీఎన్‌ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఢిల్లీ జట్టు ట్రయల్స్‌లో భరద్వాజ్‌కు చోటు దక్కకపోవడంతో అతన్ని మధ్యప్రదేశ్‌కు పంపించానని చెప్పాడు. అక్కడ డివిజన్ క్రికెట్‌లో సత్తా చాటడంతో రంజీ టీమ్‌లో కార్తీకేయకు చోటు దక్కింది.

అనూహ్య అవకాశంతో..

అనూహ్య అవకాశంతో..

రంజీ క్రికెట్‌లో రాణించిన కార్తికేయ లోని ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్.. జట్టులోని యువ లెఫ్టార్మ్ పేసర్ అర్షద్ ఖాన్ గాయపడటంతో అతనికి రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి తీసుకుంది. ఆడింది నాలుగు మ్యాచులే అయినా తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ సందర్భంగా మాట్లాడుతూ.. తాను 9 ఏళ్లుగా ఇంటికి వెళ్లలేదని కార్తికేయ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అతను.. సుదీర్ఘ విరామానికి చెక్ పెడుతూ తల్లిని కలిశాడు. ఈ మేరకు కార్తికేయ తన ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాడు. '9 ఏళ్ల 3 నెలల తర్వాత అమ్మను, నా కుటుంబాన్ని కలిశాను. నా ఫీలింగ్స్‌ను వెల్లడించడానికి మాటలు రావడం లేదు..'అని ట్వీట్‌ చేశాడు.

Story first published: Wednesday, August 3, 2022, 16:35 [IST]
Other articles published on Aug 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X