అయ్యో బుమ్రా.. సగం ఓవర్‌కే రిటైర్డ్‌ హర్ట్ అయ్యావా!!.. రోహిత్ సెటైర్

దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సందడి మెుదలైంది. అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా టోర్నీ మరో మూడు రోజుల్లో మెుదలుకానుంది. లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే లీగ్‌లో పాల్గొనే జట్లన్నీ తమ ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఆటగాళ్లు ఒకవైపు ప్రాక్టీస్‌ చేస్తూ.. మరోవైపు షూట్‌లలో పాల్గొంటున్నారు. స్పాన్సర్‌ల కోసం యాడ్ షూట్‌లలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు.

రోహిత్‌ గల్లీ క్రికెట్

రోహిత్‌ గల్లీ క్రికెట్

ఐపీఎల్‌ 2020కి 'డ్రీమ్‌ 11' సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ స్పాన్సర్‌గా 'వివో' తప్పుకున్న నేపథ్యంలో ఏడాది కాలానికి గానూ రూ.250 కోట్లతో డ్రీమ్‌ 11 కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఐపీఎల్‌ 13వ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్లతో ప్రమోషనల్‌ వీడియోలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో ఓ ప్రమోషనల్‌ వీడియో చేసింది. ఆ వీడియోను విడుదల చేసింది. వీడియోలో రోహిత్‌ గల్లీ క్రికెట్‌ ఆడుతుంటాడు.

వెళ్లి నీ సొంత బ్యాట్‌ తెచ్చుకో

వీడియోలో రోహిత్ శర్మ చేతిలో బ్యాట్‌ పట్టుకొని హిట్టింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నావ్‌ అని రోహిత్‌ను అడుగుతాడు. ఓపెనింగ్‌ చేస్తున్నా అంటూ హిట్‌మ్యాన్‌ బదులిస్తాడు. దీనికి అవతలి వ్యక్తి నీ చేతిలో ఉన్న బ్యాట్‌ ఎవరిది అని అడుగుతాడు. బ్యాట్‌ నీదేనా అని రోహిత్ ప్రశ్నిస్తాడు. దీంతో ఆ వ్యక్తి రోహిత్‌ చేతిలో ఉన్న బ్యాట్‌ తీసుకుని.. బ్యాట్‌ నాదే అని చెప్తాడు. వెళ్లి నీ సొంత బ్యాట్‌ తెచ్చుకో.. అప్పటివరకు ఫీల్డింగ్‌ చేయ్‌ అంటూ పక్కన కూర్చోబెడతాడు. దాంతో రోహిత్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. అక్కడితో వీడియో ఎండ్ అవుతుంది.

సగం ఓవర్‌కే రిటైర్డ్ హర్ట్

సగం ఓవర్‌కే రిటైర్డ్ హర్ట్

ఈ వీడియో చూసిన ముంబై ఇండియన్స్‌ సహచరుడు, పేస్ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ట్విటిర్‌లో షేర్‌ చేస్తూ కామెంట్‌ చేశాడు. 'రోహిత్‌ బయ్యా.. అది మన క్రికెట్‌ కాదు. గల్లీ క్రికెట్‌. నీ సొంత బ్యాట్‌ తెచ్చుకొని బరిలోకి దిగు' అంటూ కామెంట్‌ జత చేశాడు. బుమ్రా షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మరోవైపు బుమ్రా కూడా ప్రమోషనల్‌ వీడియో చేశాడు. అందులో తన రెగ్యులర్ శైలిలో కాకుండా.. త్రో బౌలింగ్ చేసి వికెట్ తీస్తాడు. ఇంకా మూడు బంతులుండగానే బుమ్రాను పక్కనపెట్టాస్తారు అక్కడి వాళ్లు. మూడు బంతులు వేయాలి అని చెప్పనా.. పక్కకు తోసేస్తారు. వీడియో చూసిన రోహిత్ సెటైర్ వేసాడు. 'సగం ఓవర్‌కే రిటైర్డ్ హర్ట్' అయ్యావా అని రోహిత్ కామెంట్ చేశాడు.

చెమటోడ్చుతున్న ముంబై ఆటగాళ్లు

చెమటోడ్చుతున్న ముంబై ఆటగాళ్లు

శనివారమే తొలి మ్యాచ్ ఉండడంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్‌ కోచ్ మహేల జయవర్ధనే పర్యవేక్షణలో ఆ జట్టు ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. జయవర్థనే పర్యవేక్షణలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ తనలోని మొత్తం శక్తిసామర్థ్యాలను వెలికి తీస్తున్నాడు. నెట్స్‌లో ఫుల్ స్టీమ్‌తో బంతులు విసురుతూ చెమటోడ్చుతున్నాడు. ఈ క్రమంలో విసిరిన ఓ బంతికి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయ్యింది.

Suresh Raina బంధువుల దాడి కేసులో వీడిన మిస్టరీ.. అచ్చం సినిమాలో జరిగినట్టే!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 16, 2020, 15:52 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X