Suresh Raina బంధువుల దాడి కేసులో వీడిన మిస్టరీ.. అచ్చం సినిమాలో జరిగినట్టే!!

పంజాబ్: గత నెలలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మేనత్త కుటుంబ సభ్యులను హత్య చేసిన ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం తెలిపారు. దీంతో దాడి కేసులో మిస్టరీ వీడింది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని, ఈ కేసులో మరో 11 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పంజాబ్ డీజీ దినకర్ గుప్తా వెల్లడించారు.

రైనా మేనత్త కుటుంబంపై దాడి

రైనా మేనత్త కుటుంబంపై దాడి

ఆగస్టు 19న పఠాన్‌కోట్ జిల్లాలోని థర్యాల్ గ్రామంలో సురేష్ రైనా మేనత్త కుటుంబంపై దాడి జరిగింది. ఈ దాడిలో రైనా మామ, కాంట్రాక్టర్ అశోక్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల అనంతరం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. రైనా కజిన్ కౌశల్ కుమార్ కూడా చనిపోయాడు. అయితే రైనా మేనత్త పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. ఇక దాడిలో గాయపడిన మరో ఇద్దరు మాత్రం చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన రైనా.. విషయం తెలుసుకుని స్వదేశానికి తిరిగొచ్చాడు. అప్పడు విషయం వెలుగు వచ్చింది. తన మేనత్త కుటుంబంపై దాడికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని పంజాబ్ సీఎంను రైనా కోరాడు.

సినిమాలో చూపించినట్టే:

సినిమాలో చూపించినట్టే:

సురేష్ రైనా ప్రత్యేకంగా కోరడంతో సీఎం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఆపై సిట్ బృందం వంద మందికి పైగా అనుమానితులను విచారించింది. ఇక సెప్టెంబర్ 15న సిట్‌కు ముగ్గురు అనుమానితుల గురించి సమాచారం తెలిసింది. పఠాన్‌కోట్ రైల్వే స్టేషన్ సమీపంలోని గుడిసెల్లో నిందితులు ఉంటున్నట్లు సిట్‌కు తెలుసుకుంది. వెంటనే దాడి చేసి అక్కడ ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. సవాన్, ముహబ్బత్, షారుక్ ఖాన్‌లను నిందితులుగా సిట్ గుర్తించింది. అయితే ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అచ్చం సినిమాలో చూపించినట్టే రైనా మేనత్త కుటుంబంపై దాడి జరిగిందట.

రెక్కీ నిర్వహించాం

రెక్కీ నిర్వహించాం

నిందితుల్లో ఒకడైన సవాన్ విచారణలో భాగంగా సిట్ బృందంకు తమ ప్లాన్ గురించి వివరించాడు. 'ఆగస్టు 12న కొందరం కలిసి నౌసౌ ఆటోలో రాజస్థాన్‌లోని చిరావా నుంచి పిలానీకి వెళ్లాం. అక్కడ మరికొందరితో కలిసి లుథియానా చేరుకున్నాం. అక్కడ మరో ముగ్గురు మాతో కలిశారు. లుథియానాలోని ఓ హార్డ్‌వేర్ షాప్ నుంచి కటింగ్ ప్లేయర్, స్క్రూడ్రైవర్ వంటి పరికరాలను కొనుగోలు చేశాం. కొన్ని బట్టలు కూడా కొన్నాం. ఇక పఠాన్‌కోట్ ప్రాంతం గురించి బాగా తెలిసిన సంజూ అనే వ్యక్తి మాతో కలిశాడు. మేమంతా కలిసి ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించాం' అని సవాన్ చెప్పాడు.

కర్రలతో బాదాం

కర్రలతో బాదాం

'ప్లాన్ ప్రకారం ఆగస్టు 19న రాత్రి 8 గంటల సమయంలో ముందుగా అనుకున్న చోటుకు వెళ్లాం. జమాయిల్ కర్రలను కూడా వెంట తెచ్చుకున్నాం. మాకు అనువుగా అక్కడే వెదురు కర్రల షాప్ ఉంది. వెదురు కర్రల సాయంతో మొదటగా రెండు ఇళ్లలోకి చొరబడ్డాం. మూడో ఇల్లు అశోక్ కుమార్‌ది. కర్రల సాయంతో ఐదుగురం ఇంట్లోకి ప్రవేశించాం. ముగ్గురు వ్యక్తులు చాప మీద పడుకొని ఉండటాన్ని గమనించి.. వారి తలమీద కర్రలతో బాదాం. ఆపై మరో ఇద్దరిపై దాడి చేసి నగదు, బంగారు ఆభరణాలతో పరారయ్యాం' అని సవాన్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో‌ నమోదైన సెంచరీలు 58.. క్రిస్ గేల్ బాదింది ఎన్నో తెలుసా?!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 16, 2020, 14:59 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X