న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో ఉన్న తేడా ఇదే: ఎమ్మెస్కే

 MSK Prasad Differentiates Between Dhoni, Kohli and Rohit as Captains

న్యూఢిల్లీ: కెప్టెన్సీ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మది ఒక్కొక్కరిది ఒక్కో భిన్నమైన శైలి అని మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపాడు. సారథ్యంలో ఈ ముగ్గురు ముగ్గురేనని, ఎవరికి వారే సాటని చెప్పుకొచ్చాడు. తాజాగా ఫ్యాన్‌కోడ్ యాప్ ఆన్‌లైన్ సెషన్‌లో మాట్లాడిన ఈ మాజీ సెలెక్టర్.. ఈ ముగ్గురి కెప్టెన్సీని విశ్లేషించాడు.

 ఎవరి స్టైల్ వారిదే..

ఎవరి స్టైల్ వారిదే..

‘కెప్టెన్సీలో ఈ ముగ్గురిదీ ఒక్కో శైలి. సారథ్య విషయంలో ఈ ముగ్గురు ఎవరికీ వారే ప్రత్యేకం. ధోనీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతడి మదిలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, వాటిని ఎప్పుడు ఎలా అమలు చేస్తాడో పసిగట్టలేం. విరాట్‌ చాలా స్పష్టతతో ఉంటాడు. తనకు ఏం కావాలో బాగా తెలుసు. ఇకపోతే రోహిత్‌ శర్మ.. సహచరుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరిస్తాడు. ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచిస్తాడు.'అని చెప్పుకొచ్చాడు.

 ధోనీ భవితవ్యంపై..

ధోనీ భవితవ్యంపై..

ఇక ధోనీ భవితవ్యంపై మాట్లాడుతూ.. ఆట నుంచి ఇప్పుడే తప్పుకోవద్దని తాము ధోనీతో చర్చించామని, ఆలోపు యువ వికెట్ కీపర్‌ రిషభ్ పంత్‌ను సిద్దం చేసుకోవాలనుకున్నామని తెలిపాడు. ‘కొన్నాళ్లు ఆటకు విరామం ప్రకటించాలనుకున్న ధోనీతో మేం చర్చంచాం. ఈ సమయంలో రిషభ్ పంత్‌ను సిద్దం చేసుకోవాలని భావించి అతనికి అవకాశాలు ఇచ్చాం. ఇప్పుడు మహీ స్థానంలో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై సత్తాచాటాడు. అయితే ఐపీఎల్ జరిగితే మహీ సత్తా తెలిసేది. కానీ ప్రస్తుత పరిస్థితులు మరి సంక్లిష్టంగా మారాయి.'అని ఎమ్కెస్కే అభిప్రాయపడ్డాడు.

 అందుకే రైనాను ఎంపిక చేయలేదు..

అందుకే రైనాను ఎంపిక చేయలేదు..

సురేష్‌ రైనాను భారత జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అతని పేలవ ఫామ్‌ కారణమని ఎమ్మెస్కే తెలిపాడు. 2018-19 దేశవాళీ సీజన్‌లో అతడు పెద్దగా పరుగులు సాధించలేదన్నాడు. 'జాతీయ జ‌ట్టుకు దూర‌మైన త‌ర్వాత సురేష్ రైనా దేశ‌వాళీల్లో ఏమంత గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. 2018-19 రంజీ సీజ‌న్‌లో అత‌డి ఆట పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అలాగే ఐపీఎల్లోనూ అత‌డి బ్యాట్ నుంచి మునుప‌టి మెరుపులు క‌నిపించ‌లేదు. ఇతర యువకులు దేశీయ క్రికెట్, ఇండియా-ఎలో అద్భుత ప్రదర్శనలు చేసారు. భారత జట్టులో చోటు దక్కించుకున్నారు' అని ఎమ్మెస్కే పేర్కొన్నాడు.

ధోనీ, కోహ్లీ వెన్నుపోటు పొడిచారు.. యూవీ తండ్రి సంచలన వ్యాఖ్యలు!

Story first published: Wednesday, May 6, 2020, 9:32 [IST]
Other articles published on May 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X