న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, కోహ్లీ వెన్నుపోటు పొడిచారు.. యూవీ తండ్రి సంచలన వ్యాఖ్యలు!

Yograj Says MS Dhoni and Virat Kohli backstab Yuvraj Singh
MS Dhoni & Virat Kohli Are Backstabbed Yuvaraj Singh - Yograj Singh

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కెప్టెన్‌, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్‌ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీల వెన్నుపోటు కారణంగానే తన కుమారుడు వెనకబడిపోయాడని యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆరోపించారు. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన యువరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సౌరవ్ గంగూలీ నుంచి లభించినంత మద్దతు ఏ కెప్టెన్ నుంచి కూడా లభించలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ దాదానే అనే కూడా స్పష్టం చేశాడు.

వెన్నుపోటు పొడిచారు..

వెన్నుపోటు పొడిచారు..

అయితే మహీ కెప్టెన్సీ‌పై గతంలో కూడా విమర్శలు గుప్పించిన యోగ్‌రాజ్.. తాజాగా న్యూస్ 24 చానె‌ల్‌తో మాట్లాడుతూ యువరాజ్‌ సింగ్‌ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారని.. అందులో ధోనీ, విరాట్ కూడా ఉన్నారని మండిపడ్డారు. ‘ధోనీ, కోహ్లీలతో పాటు సెలెక్టర్లు కూడా యువరాజ్‌కు మద్దతు ఇవ్వలేదు. యువీ ఫామ్‌లోకి వస్తే ఎలా? అనే ఆందోళన అందరిలోనూ కనిపించేది. చాలామంది యువీకి వెన్నుపోటు పొడిచారు. నిజంగా ఇది అతడిని ఎంతగానో బాధించింది.

ఇటీవల కోచ్‌ రవిశాస్త్రి కలిసాడు. నాతో సెల్ఫీ కూడా దిగాడు. నేను అతనితో దిగ్గజ ఆటగాళ్ల వీడ్కోలు విషయాన్ని ప్రస్తావించా. కెరీర్‌లో వారి ప్రదర్శన ఆధారంగా క్రికెటర్లకు ఘనంగా వీడ్కోలు పలకాలని సూచించా. ధోనీ, రోహిత్, కోహ్లీ రిటైర్ అయినా వారికి ఘన వీడ్కోలు ఇవ్వాలి. భారత క్రికెట్‌కు వారు చేసిన సేవలను గుర్తించాలని సూచించా.'అని యోగ్‌రాజ్‌ తెలిపారు.

 క్రికెట్‌లో ఏబీసీలు కూడా తెలియవు.

క్రికెట్‌లో ఏబీసీలు కూడా తెలియవు.

టీమిండియా సెలక్షన్ ప్యానెల్‌ సభ్యుడు శరణ్‌దీప్ సింగ్ కూడా యువరాజ్ పట్ల వివక్ష చూపారని ఆయన పేర్కొన్నారు. ‘శరణ్‌దీప్ సింగ్ వెళ్లిన మీటంగ్‌లలో యువరాజ్‌ను జట్టు నుంచి తప్పించాలని చెప్పేవారు. క్రికెట్‌‌లో ఏబీసీలు కూడా తెలవని వాళ్లు మన సెలక్టర్లా..? అలాంటి వారి నుంచి ఏం ఆశిస్తాము. మనని వెన్నుపోటు పొడవటం తప్ప. ఒకవేళ యువరాజ్ ఎక్కడ మంచి ప్రదర్శన చేస్తాడా.. అని వాళ్లు భయపడిపోయేవాళ్లు'' అని యోగ్‌రాజ్ చెప్పుకొచ్చారు.

 రైనా కోసం..

రైనా కోసం..

ఇక 2011 ప్రపంచకప్ సమయంలో సురేశ్ రైనాకు ధోనీ మద్దతు ఎక్కువగా ఉండేదని, తుది జట్టులోకి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డాడని ఇటీవల యువరాజ్ సింగ్ తెలిపిన ఈ విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై యోగ్‌రాజ్ మాట్లాడుతూ.. యువరాజ్‌ను తప్పియాలనే ఉద్దేశంతోనే ధోనీ రైనాకు మద్దతు ఇచ్చారని, అప్పట్లో ఈ విషయాన్ని తన వద్ద చాలా మంది ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేనన్నారు.

క్రికెటర్ల భార్యల వైపు చూసి.. కోహ్లీ అలా అరవడంతో రెచ్చిపోయా: రసెల్

https://telugu.mykhel.com/cricket/andre-russell-reveals-how-he-got-triggered-to-play-his-13-ball-48-knock-in-ipl-2019-027915.html

Story first published: Wednesday, May 6, 2020, 9:15 [IST]
Other articles published on May 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X