వైరల్ వీడియో : ధోనికి బాడీగార్డ్‌గా మారిన హెయిర్ స్టైలిస్ట్ సప్న

హైదరాబాద్: టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మైదానానికి దూరమై సూమారు 8 నెలలు అవుతోంది. వన్డే వరల్డ్‌కప్ సెమీస్ ఓటమి అనంతరం పూర్తిగా ఆటకు దూరమైన మహీ.. తొలుత భారత సైన్యంలో సేవ చేసేందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని మీడియాకు సూచించాడు.

ఆ తర్వాత కూడా ధోని తన భవితవ్యంపై నోరు విప్పకపోవడం.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు కోల్పోవడంతో మహీ రిటైర్మెంట్‌పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ధోని మాత్రం ఇవేమి పట్టించుకోకుండా త‌న‌కు ల‌భించిన విరామాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

తగ్గని అభిమానం..

తగ్గని అభిమానం..

ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్పప్పటికీ అతనికి అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. ముంబై సమీపంలోని థానెలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఒక యాడ్ షూటింగ్ కోసం మహీ థాణెకు వచ్చాడు. అతడు నడుచుకుంటూ వస్తుండగా గుమిగూడిన వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా అతడి వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో అతడి హెయిర్‌ స్టైలిస్ట్‌ సప్న భావ్‌నాని బాడీగార్డ్‌గా మారింది. అతడి ముందు రెండు చేతులు చాపుతూ వస్తున్నవారిని వెనక్కి నెట్టింది.

టైడ్ కావాలా నాయనా? న్యూజిలాండ్ జెర్సీలపై ఫ్యాన్స్ కుళ్లు జోకులు.!!

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షూటింగ్ ముగిసిన తర్వాత సప్ననే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి ‘90% సెక్యూరిటీ 10% హెయిర్ 500% ఫ్యాన్ గర్ల్'అని #captainsaab #dhonieverywhere అనే యాష్ ట్యాగ్‌లతో క్యాప్షన్‌గా పేర్కొంది.

ఎవరీ సప్న..

సప్న ప్రముఖ హెయిర్‌ స్టైలిస్టే కాకుండా ధోనికి వీరా అభిమాని. స్నేహితురాలు కూడా. అతడికి గత కొంత కాలంగా హెయిర్ స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ఆమె బిగ్‌బాస్‌లోనూ పాల్గొంది. సీనీ తారాలకు కూడా హెయిర్ స్టైలిస్ట్‌ చేస్తుంది.

బాత్‌రూమ్ సింగర్‌గా..

బాత్‌రూమ్ సింగర్‌గా..

మొన్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా అవతారమెత్తిన ధోని.. తాజాగా బాత్‌రూం సింగర్‌గా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. తన సహచర ఆటగాళ్లు పార్థీవ్ పటేల్, పియూష్ చావ్లాతో బాత్‌రూంలో సింగింగ్ సెషన్‌ను తెగ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఈ ముగ్గురు ఆటగాళ్లు కిషోర్‌ కుమార్ ఐకానిక్ బాలీవుడ్ సాంగ్ ‘మేరే మెహబూబా కయమత్ హోగీ'ఇతర వ్యక్తులతో పాడుతూ కనిపించారు. ధోని వాష్‌బెసిన్ పక్కన కూర్చోగా చావ్లా, పార్దీవ్ కింద కూర్చొని పాటకు ట్యూన్ ఇస్తూ ఎంజాయ్ చేశారు.

ప్రాక్టీస్‌కు రెడీ..

ప్రాక్టీస్‌కు రెడీ..

ఇక ఈ ఐపీఎల్ సీజన్‌కు ధోని సమాయత్తం అవుతున్నాడు. మార్చి 29 నుంచి ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుండటంతో చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోని తన ప్రాక్టీస్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. మార్చి ఒకటవ తేదీ నుంచి చెపాక్‌ స్టేడియంలో ధోని ప్రాక్టీస్‌ను ఆరంభించనున్నాడు. గత నెలలో జార్ఖండ్‌ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేసిన ధోని.. ఐపీఎల్‌ కోసం తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేయాలని చూస్తున్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, February 19, 2020, 20:40 [IST]
Other articles published on Feb 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X