టైడ్ కావాలా నాయనా? న్యూజిలాండ్ జెర్సీలపై ఫ్యాన్స్ కుళ్లు జోకులు.!!


హైదరాబాద్: పది రోజుల విరామం తర్వాత న్యూజిలాండ్-భారత్ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో చెరొకటి గెలిచి సమంగా నిలిచిన ఇరుజట్లు సంప్రదాయక ఆటలో అమీతుమి తేల్చుకోవడానికి రెడీ అయ్యాయి.
ఐదు టీ20ల సిరీస్‌ను కోహ్లీసేన 5-0తో క్లీన్ స్వీప్ చేయగా.. మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో గెలుచుకొని కివీస్ బదులు తీర్చుకుంది. దీంతో రెండు టెస్ట్‌ల పోరు ఆసక్తికరంగా మారింది. టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న సిరీస్ కావడంతో రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.
కివీస్ ట్వీట్..
ఈ మ్యాచ్ నేపథ్యంలోనే ఇరు జట్ల కెప్టెన్లు బుధవారం మీడియాతో మాట్లాడటంతో పాటు ప్రీ సిరీస్ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించిన ఓ ఫొటోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా షేర్ చేసింది. దీనికి‘తొలి టెస్ట్ నేపథ్యంలో కెప్టెన్ల ఫొటో సమయం'అని క్యాప్షన్‌గా పేర్కొంది.
ఫొటోలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ
అయితే ఈ ఫొటోలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ తళుక్కున మెరుస్తుండగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జెర్సీ మాసినట్లుంది. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సరదా కామెంట్స్‌తో ఆటపట్టిస్తున్నారు. న్యూజిలాండ్ జెర్సీపై కుళ్లు జోకులు పేల్చుతున్నారు. దీంతో ఈ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
టైడ్ అడ్వర్టైజ్‌మెంటా?
ఇరు జట్ల జెర్సీల రంగుల్లో తేడా ఉండటంతో ఇది టైడ్ బట్టల సబ్బు అడర్వటైజ్‌మెంట్‌లా ఉందని ఒకరంటే.. నెక్ట్స్ టైమ్ మీ అమ్మను ఉజాల వేసి ఉతకమని మరొకరు.. బ్లాక్ క్యాప్స్ టైడ్ వాడాలని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే టైడ్ న్యూజిలాండ్‌కు స్పాన్సర్ చేయాలని కోరుతున్నారు. మరికొందరు వాషింగ్ ఫౌడర్ నిర్మ.. నిర్మా మహిమా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఉజాలా వద్దు.. టైడ్ వాడండని, పర్లేదు భారత్ జట్టు వైట్ వాష్ చేస్తుతుందిలే.. అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

పరిపూర్ణమైన జట్టుతో ..
న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యామని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. ప్రత్యర్థి జట్టులో నైపుణ్యం గల బౌలర్లు.. మెరుగైన ఫీల్డర్లు ఉన్నారు కాబట్టి వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నామని తెలిపాడు. అయితే సొంతగడ్డపై సిరీస్ ఆడటం కివీస్‌కు కలిసి వచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు.
‘ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా సునాయాసంగా తలపడే రీతిలో మేం సిద్ధమయ్యాం. ఫిట్‌నెస్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. పూర్తి విశ్వాసం, సానుకూల దృక్పథంతో ఈ సిరీస్‌ను ప్రారంభించబోతున్నాం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మైదానంలోని ప్రేక్షకులు కీలక పాత్ర పోషిస్తారు.
ముఖ్యంగా న్యూజిలాండ్‌లో ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు కూడా పూర్తి క్రమశిక్షణతో ఉంటారు. వాళ్లు కూడా ఫిట్‌గా ఉంటారు. వారు రోజంతా మైదానంలోనే కూర్చుని.. ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఏ వైపు నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో ఊహించలేం. సో.. ఆఫ్ ఫీల్డ్ కంటే కూడా ఆన్‌ఫీల్డ్‌పై ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో తలపడేందుకు పరిపూర్ణమైన జట్టుతో మైదానంలోకి దిగబోతున్నాం' అని చెప్పుకొచ్చాడు.

2014లో 0-1తో ఓటమి..
టెస్ట్ చాంపియన్‌షిప్ రారాజుగా ఉన్న భారత్‌కు న్యూజిలాండ్‌లో మాత్రం మంచి రికార్డు లేదు. 2014లో ఇక్కడ టెస్ట్ సిరీస్ ఆడిన భారత్ 0-1తో ఓటమిపాలైంది. కానీ గట్టి పోటీనిచ్చింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్నప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే ఆలౌట్ చేసింది. కానీ 406 పరుగల లక్ష్యానికి 40 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications