న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ బౌలర్లకు ధీటుగా బదులివ్వాలంటే పూజారా, కోహ్లీలే కీలకం

Mohinder Amarnath predicts two of India’s best batsmen in Perth

న్యూ ఢిల్లీ: భారీ అంచనాలతో పెర్త్ వేదికగా బరిలోకి దిగిన ఆసీస్-భారత్‌లు బౌన్సీ పిచ్‌లో సవాళ్లు విసురుకుంటున్నాయి. తొలి టెస్టు విజయానంతరం ఆడుతోన్న మ్యాచ్ కావడంతో గెలుపును కొనసాగించాలని భారత్.. తమ సత్తా చాటి టీమిండియాను ఓడించాలని ఆసీస్ ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలో టీమిండియాకు ఇప్పటికే అశ్విన్‌, రోహిత్‌ శర్మ దూరమైయ్యారు. మరోవైపు తొలి టెస్టుకు ముందే దూరమైన పృథ్వీషా ఇప్పటికీ కోలుకున్నట్లుగా కనిపించడం లేదు. దీంతో వీరి స్థానాల్లో హనుమ విహారి, రవీంద్ర జడేజా, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ను ఎంపిక చేశారు.

ధీటుగా బదులివ్వాలంటే కోహ్లీ, పుజారాలే కీలకమని

ధీటుగా బదులివ్వాలంటే కోహ్లీ, పుజారాలే కీలకమని

అయితే ఈ టెస్టులో ఆసీస్ బౌలర్లకు ధీటుగా బదులివ్వాలంటే టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, పుజారాలే కీలకమని మాజీ క్రికెటర్‌ మొహీందర్‌ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. మ్యాచ్ గెలవడం కోసం ఎలాంటి వ్యూహరచనకైనా సిద్ధమయ్యే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఈ సారి పెర్త్‌ను పూర్తి బౌన్సీ పిచ్‌గా తయారుచేశారు. జోహన్నస్ బర్గ్ స్టేడియాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని ఇలా చేశారు. పిచ్ క్యూరేటర్ అధికారుల ఆదేశాల మేరకే ఇలా పూర్తి స్థాయి బౌన్సీ పిచ్‌గా సిద్ధం చేసినట్లు పేర్కొన్నాడు. గతంలో ఇలా చేయడం వల్ల ప్లేయర్ల నుంచి వందకు వంద మార్కులు తెచ్చుకున్నానంటూ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా తాను తీసిన గోతిలో తానే పడనుందట!!

టీమిండియా బ్యాటింగ్‌ను అడ్డుకోవాలని

టీమిండియా బ్యాటింగ్‌ను అడ్డుకోవాలని

దీనిపై అమర్‌నాథ్‌ మాట్లాడుతూ...‘ ఇప్పుడున్న టీమిండియాకు ఎంతో అనుభవం ఉంది. వాళ్లు ఎలాంటి సవాళ్లకు భయపడరు. తొలి టెస్టు గెలిచాక వారిలో ఆత్మవిశ్వాసం మరింత మెరుగైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పెర్త్‌లోని పరిస్థితుల గురించి కూడా టీమిండియా ఒక అంచనాకు వచ్చి ఉంటుంది. ఇక ఆసీస్‌ విషయానికొస్తే తమ బౌలింగ్‌తో టీమిండియా బ్యాటింగ్‌ను అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు'

ధావన్‌ జట్టులో ఉంటే బావుండేది

ధావన్‌ జట్టులో ఉంటే బావుండేది

'అయితే టీమిండియా విరాట్‌ కోహ్లీ, పుజారా వంటి బ్యాట్స్‌మెన్‌ ఉన్నప్పుడు వాళ్లను ఎదుర్కోగలరు. గత టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ చేసిన పొరబాట్లను సరిదిద్దుకుని చక్కగా రాణిస్తే చాలు. కానీ, పుజారాలాగా క్రీజులో ఎక్కువసేపు నిలవడమనేది చాలా ముఖ్యమైన విషయం. ఓపెనర్లు మురళీ శర్మ, కేఎల్‌ రాహుల్‌కు మంచి ప్రతిభ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శిఖర్‌ ధావన్‌ జట్టులో ఉంటే బావుండేది' అని అభిప్రాయపడ్డారు.

1
43624
Story first published: Friday, December 14, 2018, 11:40 [IST]
Other articles published on Dec 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X