న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా తాను తీసిన గోతిలో తానే పడనుందట!!

India vs Australia 2nd Test : Michael Vaughan Believes The Green Pitch Could Favour India’s Bowlers
Michael Vaughan believes the green pitch could favour India’s bowlers over Australia in Perth

పెర్త్‌: టీమిండియాను బౌన్సీలతో బోల్తా కొట్టించాలని పచ్చికతో వికెట్‌ తయారు చేసిన ఆస్ట్రేలియా తను తీసిన గోతిలో తానే పడొచ్చని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌ హెచ్చరించాడు. టీమిండియాలో కూడా అద్భుతమైన పేసర్లు ఉన్నారన్న సంగతి గుర్తుచేశాడు. 'ఇంగ్లాండ్‌లో, అడిలైడ్‌ ఓవల్‌లో టీమిండియా బౌలింగ్‌ దాడి చూశాను. పెర్త్‌ పిచ్‌ను చూసిన బుమ్రా, షమి, ఇషాంత్‌ తడాఖా చూపిస్తారు. రాత్రి నిద్రపోయే ముందు ఆసీస్‌కు బహుశా కచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకుంటారనిపిస్తోంది' అని వాన్ వ్యాఖ్యానించాడు.

అత్యంత బౌన్సీ పిచ్‌గా తయారు చేసినట్లు..

అత్యంత బౌన్సీ పిచ్‌గా తయారు చేసినట్లు..

అధికారుల ఆదేశాల మేరకు పెర్త్‌లో పచ్చికను తొలగించకుండా అత్యంత బౌన్సీ పిచ్‌గా తయారు చేసినట్లు క్యూరేటర్ బ్రెట్ స్పితోర్పి బ్రాండ్ న్యూ అప్టస్ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌ను పూర్తిగా బౌన్స్‌కు అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు తెలిపాడు.

తాను తీసిన గోతిలో తానే పడుతుంది

‘కోహ్లీసేన ముగ్గురు పేసర్లు ఆసీస్‌ పేసర్లను మించి రాణించారు. వారు అద్భుతం. అడిలైడ్‌లో 20కి 14 వికెట్లు తీశారు. దీన్ని బట్టి చూస్తే ఆస్ట్రేలియా పెద్ద సాహసమే చేస్తోంది. ఆతిథ్య బౌలర్లకు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను నిలువరించే పిచ్‌ కచ్చితంగా అవసరమే. అడిలైడ్‌ ఓవల్‌లో భారత బౌలింగ్‌ దాడి చూశాక ఇలాంటి పరిస్థితులు సృష్టించడం అనవసరం అనిపిస్తోంది. వారు సుదీర్ఘంగా అత్యంత క్రమశిక్షణతో బౌలింగ్‌ చేశారు' అని వాన్‌ పేర్కొన్నాడు. మెరుపులా ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ చేయగల సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా జట్టుకు ఉపయోగపడతాడని వ్యాన్‌ అన్నాడు.

పిచ్ గురించి కోహ్లీ మాట్లాడుతూ..

సొంతగడ్డపై ఆస్ట్రేలియా బలమైన జట్టు. దీనికి తోడు.. బౌలర్లకి అతిగా అనుకూలించే పెర్త్ వికెట్‌పై ఆడబోతుండటం కచ్చితంగా ఆ జట్టు పుంజుకునే అవకాశం ఉంది. అయితే బౌన్సింగ్ పిచ్ కావడంతో టీమిండియాకి కూడా విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఆ ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతాం. టీమిండియా కూడా బలమైన బౌలింగ్ ఎటాక్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం జట్టులో నలుగురు లేదా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

ప్లేయర్స్ నుంచి వందకు వంద మార్క్‌లు పడ్డాయని

ప్లేయర్స్ నుంచి వందకు వంద మార్క్‌లు పడ్డాయని

మామూలుగానే ఆస్ట్రేలియా పిచ్‌లలో పెర్త్ బౌన్స్‌కు పెట్టింది పేరు. గతంలో ఇక్కడ ఆడిన అన్ని విదేశీ జట్లు బౌన్స్‌కు బెంబేలెత్తేశాయి. ఈసారి దానిని మరింత బౌన్స్‌కు అనుకూలంగా మార్చడంతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు పరీక్షగా మారనుంది. తప్పేలా కనిపించడం లేదు. గతంలో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా బౌన్స్ చాలా ఎక్కువగా ఉన్న మైదానాన్ని తయారు చేశామని, ఈసారి కూడా అలాంటిదే సిద్ధం చేస్తున్నామని సిప్‌థోర్ప్ వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో పిచ్‌కు ప్లేయర్స్ నుంచి వందకు వంద మార్క్‌లు పడ్డాయని అతను తెలిపాడు. ఇప్పుడు

1
43624
Story first published: Friday, December 14, 2018, 9:53 [IST]
Other articles published on Dec 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X