న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mohammed Siraj: లక్నో ఫ్రాంచైజీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసినా.. ఆర్‌సీబీనీ వదలని మియా భాయ్!

Mohammed Siraj Rejects Lucknow Rs 10 crore Offer Ahead of IPL 2022 Mega Auction
IPL 2022 Mega Auction: Mohammed Siraj Synonym Of Loyalty | Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలానికి ముందు కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. గత మంగళవారమే పాత ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి. కొన్ని అనూహ్యాలు... మరికొన్ని ఆశ్చర్యకర నిర్ణయాలు... మొత్తంగా చూస్తే అంచనాలకు అనుగుణంగానే ఈ రిటెన్షన్‌ ప్రక్రియ సాగింది. సుదీర్ఘ కాలంగా తమ విజయాల్లో భాగంగా ఉన్న కొందరు ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు నమ్మకం పెట్టుకోగా, మరికొందరిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనసాగించేందుకు సిద్ధపడ్డాయి.

ఇక లీగ్‌లోకి కొత్తగా వచ్చిన రెండు జట్లు రిటైన్ కానీ ఆటగాళ్ల జాబితా నుంచి ముగ్గురేసి ఆటగాళ్లను 'పికప్ ఆప్షన్'కింద ఎంచుకోనున్నాడు. అయితే రూ.7 వేల కోట్ల భారీ ధరకు లక్నో ఫ్రాంచైజీని దక్కించుకున్న గోయెంకా ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌పై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.10 కోట్లు ఇస్తానన్నా...

రూ.10 కోట్లు ఇస్తానన్నా...

లీగ్ నిబంధనలకు విరుద్దంగా రిటెన్షన్ ప్రక్రియ ముగియకముందే లక్నో ఫ్రాంచైజీ ఆటలతో గాళ్లతో సంప్రదింపులు జరిపిందని, భారీ డబ్బును ఆశచూపి ప్రలోభాలకు గురించేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీపై ఇతర ఫ్రాంచైజీలు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను కూడా లక్నో ఫ్రాంచైజీ ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసిందని వార్తలు వస్తున్నారు. అతనికి రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని, కానీ సిరాజ్ మాత్రం ఆర్‌సీబీ జట్టుకు ఆడేందుకే ఇష్టపడ్డాని తెలుస్తోంది.

సిరాజ్ సూపర్ అంటూ..

సిరాజ్ సూపర్ అంటూ..

తనకు పేరుతో పాటు మంచి భవిష్యత్తు ఇచ్చిన ఆర్‌సీబీపై సిరాజ్ విశ్వాసం కనబర్చాడని ప్రచారం జరుగుతోంది. ఆర్‌సీబీ అభిమానులు, నెటిజన్లు సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక ఈ హైదరాబాద్ పేసర్‌ను మూడో స్లాబ్ ప్లేయర్‌గా ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో అతనికి రూ. 7 కోట్ల కాంట్రాక్టు దక్కింది.

అయితే డబ్బులకు ఆశపడకుండా ఆర్‌సీబీ టీమ్‌లోని ఉండి సిరాజ్ మంచి పని చేశాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి ఉన్న ఫ్యాన్స్ బేస్ నేపథ్యంలో .. ఈ జట్టుకు ఆడటమే సిరాజ్ భవిష్యత్తుకు మంచిదంటున్నారు. ఆర్‌సీబీకి ఆడటం వల్లనే సిరాజ్.. టీమిండియాకు ఆడుతున్నాడనే విషయాన్ని అందరూ గ్రహించాలంటున్నారు. పైగా కెప్టెన్ కోహ్లీతో ఏర్పడిన సాన్నిహిత్యం కూడా అతని కెరీర్‌కు మంచిచేస్తుందని చెబుతున్నారు.

కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌..

కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌..

ఇక లక్నో ఫ్రాంచైజీ ఇప్పటికే కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లతో ఒప్పందం కుదర్చుకుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. రాహుల్‌కు అత్యధికంగా రూ.20 కోట్లు చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ సిద్దపడిందని, రషీద్ ఖాన్‌కు రూ. 14 కోట్ల ఆఫర్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ పాత ఫ్రాంచైజీలను వదిలేసారని ప్రచారం జరుగుతుంది.

దీనిపై ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐకి ఫిర్యాదు చేశాయని, ఈ ఆరోపణలు నిజమైతే ఈ ఇద్దరి ఆటగాళ్లపై నిషేధం పడే అవకాశం ఉంది. గతంలో రవీంద్ర జడేజా సైతం ఇలానే ఇతర ఫ్రాంచైజీలతో సంప్రదింపులు చేసి వేటుకు గురయ్యాడు.

ఆర్‌సీబీ రిటెన్షన్ లిస్ట్..

ఆర్‌సీబీ రిటెన్షన్ లిస్ట్..

1. విరాట్ కోహ్లీ రూ. 15 కోట్లు

2. మ్యాక్స్‌వెల్ రూ. 12 కోట్లు

3. మహమ్మద్ సిరాజ్ రూ. 7 కోట్లు

ఖర్చు చేసింది రూ.33 కోట్లు; మిగిలింది రూ.57 కోట్లు.

Story first published: Sunday, December 5, 2021, 9:30 [IST]
Other articles published on Dec 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X