న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ సూచనలను ధిక్కరించిన మహమ్మద్ షమీ

 Mohammed Shami Overlooks BCCIs Instructions, Exceeds Over Quota In Ranji Trophy Match vs Kerala

కోల్‌కతా: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా క్రికెటర్ షమీకి కేవలం ఒక్క ఫార్మాట్‌లోనే చోటు దక్కింది. బుధవారంతో మొదలైన టీ20 సిరీస్‌లో అతనిని ఎంచుకోకపోవడంతో షమీ.. రంజీ ట్రోఫీల్లో ఆడుతున్నాడు. కోల్‌కతా తరపున బరిలోకి దిగాడు. కొద్ది రోజుల ముందే బీసీసీఐ షమీకి కొన్ని సూచనలు చేసింది. బీసీసీఐ వైద్య బృందం సలహామేరకు తరచు గాయాల బారిన పడుతున్న షమీని ఒక ఇన్నింగ్స్‌లో 15-17 ఓవర్లు మించి బౌలింగ్‌ వేయవద్దంటూ స్పష్టం చేసింది.

మ్యాచ్‌కు న్యాయం చేయాలంటూ షమీ

మ్యాచ్‌కు న్యాయం చేయాలంటూ షమీ

అయినా మ్యాచ్‌కు న్యాయం చేయాలంటూ షమీ.. బీసీసీఐ మార్గదర్శకాలను షమీ పక్కన పెట్టేసింది. కేరళతో ఈడెన్‌ గార్డెన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ 15 ఓవర్ల నియమాన్ని పక్కన పెట్టేశాడు. అదే సమయంలో ఒక ఇన్నింగ్స్‌లో 26 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేశాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే షమీకి బీసీసీఐ ఇలా సూచన చేయడం జరిగింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ తర్వాత జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో షమీకి సెలక్టర్లు చోటు కల్పించారు.

సొంత క్రికెట్ అకాడమీని ప్రారంభించిన ఎంఎస్ ధోనీ

బీసీసీఐ సూచన పట్టించుకోకుండానే

బీసీసీఐ సూచన పట్టించుకోకుండానే

ఒకవేళ రంజీల్లో ఫాస్ట్ బౌలర్.. మొహమ్మద్ షమీ గాయపడి జట్టుకు దూరమైతే టీమిండియా బలహీన పడుతుందని భావించి మాత‍్రమే అతనికి బోర్డు పెద్దలు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఒక ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్‌ వేసిన షమీ.. బీసీసీఐ సూచనను పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు. మరొకవైపు ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్‌ వేయడాన్ని షమీ సమర్దించుకున్నాడు.

రాష్ట్రం తరపున ఆడుతుంటే ఓ బాధ్యత

రాష్ట్రం తరపున ఆడుతుంటే ఓ బాధ్యత

‘ ఒక రాష్ట్రం తరపున ఆడుతున్నప్పుడు ఒక బాధ్యత ఉంటుంది. దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తేనే న్యాయం చేసినట్లు. చాలా కాలం తర్వాత సొంతగడ్డపై బౌలింగ్ వేయడం చాలా సంతృప్తి అనిపించింది. ఇన్ని ఓవర్లు వేసినప‍్పటికీ అసౌకర్యంగా అనిపించలేదు' అని షమీ పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్‌ వేసిన షమీ.. 100 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.

Story first published: Thursday, November 22, 2018, 12:56 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X