Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సొంత క్రికెట్ అకాడమీని ప్రారంభించిన ఎంఎస్ ధోనీ

MS Dhoni inaugurates his first residential cricket academy in Nagpur amid fan frenzy

నాగపూర్: యువ క్రికెటర్లను సానబెట్టే లక్ష్యంతో ఎస్‌జీఆర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ధోనీ రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం ప్రారంభించాడు. నాగపూర్‌లోని గైక్వాడ్ -పాటిల్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో అకాడమీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా అకాడమీ విద్యార్థులతో ధోనీ సంభాషించాడు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అదే శైలిలో సమాధానాలిచ్చాడు.

 మురళీధరన్ లాంటి ప్లేయర్లతో

మురళీధరన్ లాంటి ప్లేయర్లతో

మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడినట్లుగా వారితో వ్యవహరించాడు. ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంక జట్టుకు వ్యతిరేకంగా ఆడిన మ్యాచ్‌లో ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను తానే ఎలా ప్రమోట్ చేసుకున్నాడో వివరించాడు. అతను శ్రీలంక బౌలర్ మురళీధరన్ లాంటి ప్లేయర్లతో చెన్నై సూపర్ కింగ్స్ వంటి టోర్నీల కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేవాడినని తెలిపాడు.

టోర్నీలో శుభారంభం చేసిన సైనా, కశ్యప్‌లు

బౌలర్లను చదవడం మరికొంత

బౌలర్లను చదవడం మరికొంత

తద్వారా తనకు బౌలర్లను చదవడం మరికొంత సులువవుతుందని పేర్కొన్నాడు. 2007లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ జోగిందర్ శర్మకు బౌలింగ్ ఎందుకిచ్చారని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు ధోనీ. అతను కాకుంటే మరెవరున్నారు. అని చమత్కరిస్తూ సమాధానమిచ్చాడు. మరో విద్యార్థి మంచి వికెట్ కీపర్‌ కావాలంటే ఏం చేయాలని అడిగితే.. వికెట్ కీపర్ అనే వాడు చాలా కీలక పాత్ర పోషిస్తాడు.

తన పని తాను చేసుకుపోయే వైస్ కెప్టెన్

తన పని తాను చేసుకుపోయే వైస్ కెప్టెన్

మ్యాచ్‌లో మౌనంగానే తన పని తాను చేసుకుపోయే వైస్ కెప్టెన్ లాంటి వాడని సమాధానం ఇచ్చాడు. అడిగిన ప్రతి ప్రశ్నకు కూల్‌గా ప్రశాంతంగా స్పందించాడు ధోనీ. ఇలా క్రికెట్ మెలకువలను వారికి వివరించాడు. ఈ సందర్భంగా ధోనీ సంతకం చేసిన బ్యాట్‌ను అకాడమీ విద్యార్థులలో లక్కీ విజేతకు బహుకరించాడు.

విద్యార్థులకు క్రికెట్ పాఠాలు

విద్యార్థులకు క్రికెట్ పాఠాలు

ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ మంగేశ్ రౌత్ మాట్లాడుతూ అకాడమీలో 125 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, వీరిలో 25 మంది రెసిడెన్సియల్ విద్యార్థులని తెలిపారు. వరుస విరామాల్లో ధోనీ అకాడమీ విద్యార్థులకు క్రికెట్ పాఠాలు బోధిస్తాడని రౌత్ స్పష్టం చేశారు.

Story first published: Thursday, November 22, 2018, 12:11 [IST]
Other articles published on Nov 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+