న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆ పాక్ బౌలర్‌ పాత్ర కీలకం: మహ్మద్ షమీ

Mohammed Shami Feels IPL Has Improved His Bowling Courtesy Wasim Akram

కోల్‌కతా: మాజీ వరల్డ్ క్లాస్ పేసర్స్ జహీర్ ఖాన్, వసీం అక్రమ్ తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ తెలిపాడు. కరోనాతో ఇంటికే పరమితమైన ఈ స్టార్ పేసర్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్రికెట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా మనోజ్ తివారితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఈ బెంగాల్ పేసర్.. సచిన్‌, సెహ్వాగ్‌, జహీర్‌, అక్రమ్‌ల ఆటను చూస్తూ పెరిగానన్నాడు.

భారత్-పాక్ మ్యాచ్‌లు చూస్తూ..

భారత్-పాక్ మ్యాచ్‌లు చూస్తూ..

భారత్-పాక్‌ మధ్య హోరాహోరీగా సాగే మ్యాచ్‌లను ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘సచిన్‌ క్రికెట్‌ గ్రేట్‌. బ్యాటింగ్‌లో సచిన్‌-వీరూ జోడీ ఓ అద్భుతం. వీరిద్దరూ ఆడుతున్నప్పుడు మైమరచి చూసేవాడిని. ఇక, బౌలింగ్‌ విషయానికొస్తే జహీర్‌ను బాగా ఫాలో అయ్యేవాడిని. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ల్లో అక్రమ్‌ ఎలా బంతులు వేస్తాడా? అని నిశితంగా గమనించే వాడిని'అని షమీ చెప్పుకొచ్చాడు.

ఇబ్బందిగా ఫీలయ్యేవాడిని..

ఇబ్బందిగా ఫీలయ్యేవాడిని..

ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్‌లోకి వచ్చినప్పుడు వసీం అక్రమ్‌తో మాట్లాడటానికి ఇబ్బందిగా ఫీలయ్యేవాడినిన ఈ భారత పేసర్ గుర్తు చేసుకున్నాడు. ‘ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు అక్రమ్‌తో సరిగా మాట్లాడలేక పోయేవాడిని. అది గమనించి అతడే నా దగ్గరకొచ్చి మాటలు కలిపేవాడు. నా బౌలింగ్‌ను పరిశీలించి ఎన్నో మెళకువలు నేర్పాడు. ఇక అనుభవం గల ప్లేయర్లు దగ్గర ఉంటే సిగ్గపడకుండా వారి నుంచి కావాల్సిన విషయాలను నేర్చుకోవాలని అక్రమ్ అన్నాడు.'అని షమీ తెలిపాడు.

జహీర్ చిట్కాలు..

జహీర్ చిట్కాలు..

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న సమయంలో జహీర్ ఖాన్‌తో కలిసి ఆడానని, మరీ ఎక్కువగా ఆడకున్నా.. కావాల్సిన విషయాలను నేర్చించేవాడని షమీ తెలిపాడు. ‘జహీర్ భాయ్‌తో ఎక్కువగా ఆడే అవకాశం రానప్పటికీ.. అతనితో మాట్లాడితే మాత్రం చాలా చిట్కాలు చెప్పేవాడు. ముఖ్యంగా కొత్త బంతిలో ఎలా బౌలింగ్‌ చేయాలో అతని నుంచే నేర్చుకున్నా'అని షమి తెలిపాడు.

 స్వచ్చమైన బ్యాట్స్‌మన్

స్వచ్చమైన బ్యాట్స్‌మన్

ఇర్ఫాన్ పఠాన్‌తో లైవ్ సెషన్ సందర్భంగా మహ్మద్ షమీ భారత ఓపెనర్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ‘రోహిత్ గొప్ప ఓపెన‌ర్‌. అత‌డు క్రికెట్‌లోని అన్నీ నైపుణ్యాలు తెలిసిన ప్యాకేజీ లాంటివాడు. యువ బ్యాట్స్‌మెన్ అత‌డి ఆట చూసి ఎంతో నేర్చుకోవ‌చ్చు. బంతిని అతడు బాదే తీరును చూసి బౌలర్లు.. విభిన్న పరిస్థితుల్లో అతను ఆడే షాట్స్‌తో బ్యాట్స్‌మెన్ ఎంతో నేర్చుకోవచ్చు.`అని షమీ కొనియాడాడు.

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం

Story first published: Thursday, April 23, 2020, 12:14 [IST]
Other articles published on Apr 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X