న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్క తప్పిదం సన్‌రైజర్స్ వరుస ఓటములకు కారణమైంది: మహమ్మద్ కైఫ్

 Mohammad Kaif Explains Where Sunrisers Hyderabad Lost Their Momentum In IPL 2022

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన హైదరాబాద్‌ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచి టాప్‌-4లోకి దూసుకొచ్చింది. అత్యంత బలమైన జట్టుగా కనిపించింది. కానీ ఆ తర్వాత మళ్లీ అదే పేలవ ప్రదర్శనను కొనసాగించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచులను గెలవడంతో పాటు రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. ఇవాళ కోల్‌కతాతో హైదరాబాద్ తలపడనుంది.

బౌలింగ్ బలహీనంగా..

బౌలింగ్ బలహీనంగా..

ఈ మ్యాచ్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు ప్రదర్శనను టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ విశ్లేషించాడు. ముత్తయ్య మురళీ ధరణ్ చేసిన తప్పిదంతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ గతిపట్టిందని చెప్పాడు. 'ఇప్పుడు ఉన్న సన్‌రైజర్స్ టీమ్‌ బౌలింగ్‌పరంగా బలహీనంగా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే గత మ్యాచుల్లో కీలకమైన మార్కో జాన్సెన్‌ను తీసుకోలేదు. అతనికి బదులు కార్తిక్ త్యాగిని ఆడించారు.

ఉమ్రాన్ ప్రభావం చూపడం లేదు..

ఉమ్రాన్ ప్రభావం చూపడం లేదు..

ఇంకా కొత్త బౌలర్లను తీసుకుంటున్నప్పటికీ బలంగా కనిపించడం లేదు. ఐదు మ్యాచ్‌ల తర్వాత వరుసగా ఓడిన రెండు మ్యాచుల్లోనే నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు (భువి, నటరాజన్‌, ఉమ్రాన్‌, జాన్సెన్‌) ఉన్నారు. ఈ నలుగురే గత మ్యాచులను గెలిపించారు. అయితే ఇప్పుడు ఇందులో జాన్సెన్‌ లేడు. ఉమ్రాన్‌ పేస్‌ పెద్దగా ప్రభావం చూపించడం లేదు.

 ముత్తయ్య తప్పిదం..

ముత్తయ్య తప్పిదం..

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌ సిక్సర్లు బాదడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బౌలర్లపై స్పిన్ బౌలింగ్‌ కోచ్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని ప్రవర్తన హైదరాబాద్‌ జట్టు రిథమ్‌ కోల్పోవడానికి కూడా ఓ కారణం. ముత్తయ్య ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండే వ్యక్తి. అయితే జాన్సెన్‌ పక్కన ఉన్నప్పుడే ముత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం సరైంది కాదు.

జాన్సెన్‌పై వేటు వేయడం..

జాన్సెన్‌పై వేటు వేయడం..

ఆ విధంగా చేయడం వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లోని మంచి వాతావరణం దెబ్బతింటుంది. ఆ మ్యాచ్‌ ముందు వరకు జాన్సెన్‌ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఒక్క మ్యాచ్‌లో సరైన ప్రదర్శన చేయకపోతే పక్కకు తప్పించి కార్తిక్‌ త్యాగిని తీసుకొని రావడం సరైన నిర్ణయం కాదు'అని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. గుజరాత్‌తో ఓటమి తర్వాతనే వరుసగా హైదరాబాద్‌ మూడు పరాజయాలను నమోదు చేసింది.

Story first published: Saturday, May 14, 2022, 18:06 [IST]
Other articles published on May 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X