న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా మాజీ క్రికెటర్లు యూట్యూబ్ వ్యూస్ కోసం దిగజారుతున్నారు: మిస్బా ఉల్ హక్

Misbah-ul-Haq slams hiring of Mickey Arthur as Pakistans first online coach

కరాచీ: యూట్యూబ్ వ్యూస్ కోసం తమ మాజీ క్రికెటర్లు దిగజారి మాట్లాడుతున్నారని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నాడు. వారి కారణంగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. విదేశీ కోచ్‌లను నియమించుకునే పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశాడు. మిక్కీ ఆర్థర్‌ను హెడ్ కోచ్‌గా పీసీబీ నియమించగా.. అతను ఆన్‌లైన్ వేదికగా సేవలందించనున్నాడు.

దాంతో తొలి ఆన్‌లైన్ కోచ్‌ను నియమించుకున్న జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఈ నియామకాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. అయితే ఈ పరిస్థితికి మాజీ క్రికెటర్లే కారణమని మిస్సా ఉల్ హక్ ఆరోపించాడు. జాతీయ క్రికెట్ జట్టుకు మిక్కీ ఆర్థర్‌ను కోచ్‌గా తిరిగి నియమించడం 'పాక్‌ క్రికెట్‌ వ్యవస్థకు ఎదురు దెబ్బ'గా పేర్కొన్నాడు.

పాక్ క్రికెట్‌కు చెంపదెబ్బ..

పాక్ క్రికెట్‌కు చెంపదెబ్బ..

పీసీబీ క్రికెట్‌ వ్యవస్థ విశ్వసనీయతను పాక్‌ మాజీ ఆటగాళ్లు దెబ్బతీశారని.. అందుకే కోచింగ్‌ బాధ్యతలను అప్పగించడానికి పీసీబీ విదేశీయుల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని మిస్సా ఉల్ హక్ అభిప్రాయపడ్డాడు. 'ఇది మా క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించే అత్యుత్తమ కోచ్‌ను నియమించుకోలేకపోతున్నాం.

అలాగే నాణ్యమైన క్రికెటర్లు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం సిగ్గు చేటు. వారంతా పాక్‌ను రెండో ఆప్షన్‌గానే చూడటం సరైంది కాదు. నేను మా సొంత క్రికెట్‌ వ్యవస్థనే తప్పుబడుతున్నా. పాక్‌ క్రికెట్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మన క్రికెటర్లను మనమే అగౌరవపర్చుకొనేలా చర్యలకు దిగడాన్ని తప్పుబడుతున్నా. ప్రస్తుతం ఉన్నవారితోపాటు మాజీ ఆటగాళ్లు కూడా ఒకరినొకరు గౌరవించుకోరు.

యూట్యూబ్ వ్యూస్ కోసం..

యూట్యూబ్ వ్యూస్ కోసం..

మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్ల రేటింగ్‌ కోసం విలువలను, విశ్వసనీయతను దెబ్బతీసేలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీని ఫలితంగా కోచింగ్‌ ఇచ్చేంత సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు పాక్‌లో లేరనే అభిప్రాయాన్ని అందరిలోనూ కలిగించారు. ప్రస్తుతం విజయవంతమైన జట్లలో ఒకటైన టీమిండియా కూడా దేశీయ కోచ్‌ వైపే మొగ్గు చూపింది.

అయితే ఇక్కడ మాత్రం పాలసీలు దారుణంగా ఉన్నాయి. మహమ్మద్‌ అక్రమ్, ఆకిబ్‌ జావెద్, ఇంజమామ్‌ ఉల్ హక్, వకార్‌ యూనిస్.. ఇలా చాలామంది అత్యుత్తమ దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరంతా కోచ్‌లుగా పనిచేశారు. కానీ వీరిని ఘోరంగా అవమానించడం బయటకు పంపారు. ఈ బాధ్యతలకు సరైనవారు కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లో వచ్చేలా చేయడంలో విజయవంతమయ్యారు'అని మిస్బా అసహనం వ్యక్తం చేశాడు.

ఆన్‌లైన్ వేదికగా కోచింగ్..

ఆన్‌లైన్ వేదికగా కోచింగ్..

పీసీబీ అప్పగించిన హెడ్ కోచ్‌/డైరెక్టర్‌ బాధ్యతలను చేపట్టడానికి మిక్కీ ఆర్థర్‌కు అడ్డంకులు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థర్‌ డెర్బీషైర్‌ కౌంటీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ పీసీబీ, కౌంటీ టీమ్ అంగీకరిస్తే.. రెండు జట్లకూ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అలా కుదరకపోతే మాత్రం అతడు పాకిస్థాన్‌ జట్టుతో కలవలేడు. కానీ ఆన్‌లైన్‌ వేదికగానీ, తన తరఫున మరొక వ్యక్తిని నియమించి కార్యకలాపాలను చూసే అవకాశం ఉంది.

Story first published: Friday, February 3, 2023, 10:21 [IST]
Other articles published on Feb 3, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X