న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌ పదవి నుండి తప్పుకున్న మైక్ హెస్సన్

Mike Hesson quits as KXIP coach after reports of India job

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌ పదవి నుండి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని మైక్ హెస్సన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా గురువారం ప్రకటించారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 2018 ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో చేరడంలో విఫలమవడంతో.. గత ఏడాది అక్టోబర్‌లో బ్రాడ్ హాడ్జ్ నుంచి హెస్సన్ బాధ్యతలు స్వీకరించాడు. హెస్సన్‌కు ఇంకా రెండేళ్ల ఒప్పందం ఉన్నా కూడా కోచ్‌ పదవి నుండి తప్పుకుంటున్నాడు. కేవలం ఒక సీజన్‌కు మాత్రమే భాద్యతలు చేపట్టాడు. ఈ సీజన్‌-12లో పంజాబ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

<strong>ఆర్చర్‌ విజృంభణ: ఆరు వికెట్లు, సెంచరీ.. యాషెస్‌ రెండో టెస్టులో చోటు?</strong>ఆర్చర్‌ విజృంభణ: ఆరు వికెట్లు, సెంచరీ.. యాషెస్‌ రెండో టెస్టులో చోటు?

నిరాశ చెందా:

నిరాశ చెందా:

'కింగ్స్ ఎలెవన్ ఫ్రాంచైజీతో నా ప్రయాణాన్ని పూర్తిగా ఆనందించాను. ఈ సీజన్ కోసం నాకు బాధ్యతలు అప్పగించిన పంజాబ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నా' అని హెస్సన్ గురువారం ట్వీట్ చేశాడు. 'ఈ సీజన్ బాగా సాగలేదు. కింగ్స్‌ పంజాబ్‌ నిరూత్సాహ పరచడంతో కొంత నిరాశ చెందా. అయితే విజయానికి వారు చాల దగ్గరగా ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. భవిష్యత్తులో పంజాబ్ బాగా రాణించాలని కోరుకుంటున్నా. పంజాబ్ జట్టుకు శుభాకాంక్షలు' అని హెస్సన్ రాసుకొచ్చాడు.

టీమిండియా కోచ్‌ పదవికి దరఖాస్తు:

టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి మైక్‌ హెస్సెన్‌ దరఖాస్తు చేసుకున్నాడు. టామ్‌ మూడీ, గ్యారీ కిరెస్టన్‌లతో పాటు హెస్సెన్‌ రేసులో ఉన్నాడు. అయితే ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే మళ్లీ ఈ పదవి దక్కే అవకాశం ఉంది. కపిల్ కమిటీ కూడా స్వదేశీ కోచ్‌కే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు పాకిస్తాన్‌ ప్రధాన కోచ్‌ పదవి నుంచి మికీ ఆర్థర్‌ను తప్పించడంతో ఆ జట్టు కొత్త కోచ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించనుంది. దాంతో పాకిస్తాన్‌ ప్రధాన కోచ్‌ పదవికి సైతం హెస్సన్‌ దరఖాస్తు చేసే అవకాశాలున్నాయి. టీమిండియా, పాకిస్తాన్‌ కోచ్‌లలో ఏదైనా ఒకటి దక్కుతుందనే.. ముందుగా పంజాబ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్ కోచ్‌గా ఆరేండ్లు:

న్యూజిలాండ్ కోచ్‌గా ఆరేండ్లు:

న్యూజిలాండ్ క్రికెట్ హెడ్ కోచ్ పదవికి హెస్సన్ గతేడాది వీడ్కోలు పలికాడు. కుటుంబ కారణాలతో కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కుటుంబంతో మరింత సమయం గడుపాలనుకుంటున్నాను అని హెస్సన్ అప్పుడు పేర్కొన్నాడు. ఆరేండ్లుగా జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెటలో కివీస్ జట్టుకు గుర్తింపు తేవడంలో హెస్సన్ కీలకంగా వ్యవహరించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్నాడు. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, సామ్ కర్రన్ లాంటి ఆటగాళ్లు పంజాబ్ జట్టులో ఉన్నారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా పంజాబ్ జట్టుకు సహయజమాని.

'మాజీ క్రికెటర్‌ అక్తర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు'

Story first published: Thursday, August 8, 2019, 17:21 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X