'మాజీ క్రికెటర్ అక్తర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు'

మాజీ క్రికెటర్ మన్సూర్ అక్తర్ (61) తనను సంప్రదించి లీగ్‌లోని కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేయమన్నాడు అని వివాదాస్పద పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ తెలిపాడు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో భాగంగా విన్‌పిగ్ హాక్స్ తరఫున ఉమర్ అక్మల్ ఆడుతున్నాడు. అదే జట్టు మేనేజ్‌మెంట్‌లో మన్సూర్ అక్తర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం మన్సూర్ అక్తర్ తనను సంప్రదించి లీగ్‌లోని కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేయమన్నాడనే విషయాన్ని కెనడా లీగ్ యాజమన్యంతో పాటు పాకిస్థాన్ అవినీతి నిరోధక విభాగానికి అక్మల్ నివేదించినట్లు పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.

మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తావా:
'లీగ్‌లోని కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేస్తావా' అని అక్తర్ ఆఫర్ చేసినట్టు అక్మల్ మా దృష్టికి తీసుకొచ్చాడని పాక్ క్రికెట్ బోర్డులోని ఒక అధికారి తెలిపారు. ఈ మ్యాచ్‌లు ఫిక్సింగ్ విషయంపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుండి మన్సూర్ అక్తర్ అప్రమత్తంగా ఉన్నాడు.

ఆర్థర్‌తో విభేదాలు:
స్పెషలిస్ట్ మన్సూర్ అక్తర్ 1980 నుంచి 1990 వరకు పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 19 టెస్టులలో 655 పరుగులు, 41 వన్డేలల 593 పరుగులు చేసాడు. ఫస్ట్ క్లాస్ (13803), లిస్ట్ ఏ (5300) లలో అదరగొట్టాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్ విన్‌పిక్ హాగ్స్ మేనేజ్‌మెంట్ కీలక సేవలందిస్తున్నాడు. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అక్మల్‌కు చోటు దక్కలేదు. కోచ్ మికీ ఆర్థర్‌తో విభేదాల నేపథ్యంలో అక్మల్‌ను ఎంపిక చేయలేదు.
శ్రీలంక హెడ్ కోచ్‌పై వేటు.. రత్నాయకేకు తాత్కాలిక పగ్గాలు

ఎప్పుడూ వివాదాల్లో:
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో యూఏఈ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సన్నాహక వన్డే సిరీస్‌లో అక్మల్ ఆకట్టుకున్నప్పటికీ.. అతనికి ప్రపంచకప్‌లో జట్టులో చోటు కల్పించలేదు. అయితే అక్మల్ ఎప్పటికీ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. 2015 ప్రపంచకప్ సందర్భంగా మరియు హాంకాంగ్ సూపర్ సిక్సర్స్ సందర్భంగా కొంతమంది బుకీలు మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేయమని తనను సంప్రదించారని ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications