న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA:నిషేధించి విరాట్ కోహ్లీ తిక్క కుదుర్చాలి.. మాజీ క్రికెటర్లు ఫైర్!

Michael Vaughan, Shane Warne and Adam Gilchrist react to Virat Kohli’s stump mic comments

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మూడో టెస్ట్‌లో దురుసుగా ప్రవర్తించిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శల పర్వం కొనసాగుతోంది. కోహ్లీ ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. సౌతాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ రివ్యూ విషయంలో సౌతాఫ్రికా అధికారిక బ్రాడ్‌కాస్టర్‌ను తప్పుబడుతూ.. స్టంప్స్ మైక్ దగ్గరికి వెళ్లి కోహ్లీ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ అయి ఉండి విరాట్ కోహ్లీ ఇలా ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

IND vs SA:విరాట్ కోహ్లీ నోటి దురుద.. రిస్క్‌లో టెస్ట్ కెప్టెన్సీ!IND vs SA:విరాట్ కోహ్లీ నోటి దురుద.. రిస్క్‌లో టెస్ట్ కెప్టెన్సీ!

కోహ్లీ తిక్క కుదుర్చాలి..

కోహ్లీ తిక్క కుదుర్చాలి..

ఇప్పటికే టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కోహ్లీది చెత్త ప్రవర్తన అంటూ విమర్శించాడు. అతనికి పరిణితి లేదని, ఇలాంటి పిల్ల చేష్టల కారణంగా యువ ఆటగాళ్లు ఎలాంటి సందేశం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్, కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌ అయితే కోహ్లీకి భారీ జరిమానా వేయాలని.. లేదంటే ఓ మ్యాచ్ నిషేధం విధించాలని ఐసీసీకి సూచించాడు. ప్రతీ ఒక్కరు భావోద్వేగాలు ప్రదర్శించడం సహజమని.. అయితే సారథి ఇలా చేయడం సరికాదన్నాడు. ఈ విషయంలో ఐసీసీ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాడు.

ఎంతటి వారైనా శిక్షించాల్సిందే..

ఎంతటి వారైనా శిక్షించాల్సిందే..

ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌ సైతం టీమిండియా కెప్టెన్ తీరును తప్పుబట్టాడు. ప్రతీ విషయంలోనూ ఓ హద్దు ఉంటుందని... అది దాటితే ఎంతటివారైనా తప్పును ఉపేక్షించాల్సిన అవసరం లేదని గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. పరోక్షంగా విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకోవాలన్నాడు. ఇక ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ సైతం విరాట్ కోహ్లీ ప్రవర్తన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ అంతర్జాతీయ జట్టు కెప్టెన్‌ ఇలా వ్యవహరిస్తాడని తాను అస్సలు ఊహించలేదన్నాడు. ఒక్కోసారి అసహనం హద్దు దాటుతుందని, అయితే పదే పదే ఇలా చేయడం సరికాదన్నాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసంర ఉందన్నాడు. ఇలాంటివి సహించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు.

టీమిండియా ఓటమి కంటే..

టీమిండియా ఓటమి కంటే..

సౌతాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ డారిల్‌ సైతం భారత కెప్టెన్‌ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాడు.ఇక సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓటమి కంటే.. విరాట్ కోహ్లీ ప్రవర్తననే జట్టుకు మరింత అప్రతిష్టను తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరో వైపు విరాట్ కోహ్లీ మాత్రం తమ చర్యలను సమర్థించుకున్నాడు. మైదానంలోని పరిస్థితులు బయట వాళ్లకు అర్థం కావని చెప్పాడు.

Story first published: Saturday, January 15, 2022, 14:58 [IST]
Other articles published on Jan 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X