న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌కు అంత సీన్ లేదు.. కోహ్లీనే ఆల్‌టైమ్ బెస్ట్ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Virat Kohli Is 'World's Best Batsman', Not Steve Smith, Says Michael Vaughan || Oneindia Telugu
Michael Vaughan Says Virat Kohli as the best all-format batsman ahead of Steve Smith

హైదరాబాద్ : ప్రస్తుతం అన్నిఫార్మాట్లలో రాణించే ఫైనెస్ట్ బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ అంటే తాను ఏమాత్రం ఒప్పుకోనని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ తెలిపాడు. తన దృష్టిలో విరాట్ కోహ్లీనే ఆల్ టైమ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అని పేర్కొన్నాడు.

భారత్‌తో బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన డిసైడర్ వన్డేలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కీలక స్థితిలో క్రీజులోకి వచ్చిన స్మిత్.. యువప్లేయర్ లబుషేన్‌తో కలిసి క్లాస్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.

ఈ క్రమంలోనే ఓ ట్విటర్ యూజర్ స్టీవ్ స్మిత్ సెంచరీని కొనియాడాడు.' ప్రస్తుతం తరుణంలో అన్ని ఫార్మాట్లలో ఫైనెస్ట్‌ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్.. ఇది మరోసారి నిరూపితమైంది.'అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి ఇంగ్లండ్ దిగ్గజం మైఖెల్ వాన్ స్పందించాడు. 'దీనిని నేను మాత్రం ఒప్పుకోను... విరాటే అన్ని ఫార్మాట్లలో గొప్ప బ్యాట్స్‌మన్'అని బదులిచ్చాడు. కొందరు మైఖెల్ వాన్ అభిప్రాయంతో ఏకీభవించగా.. మరికొందరూ మాత్రం తప్పుబడుతున్నారు. మరికొందరూ ప్రస్తుత తరుణంలో ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మనేనని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

స్మిత్ సెంచరీతో భారత్ ముందు ఆసీస్ పోరాడే స్కోర్ ఉంచినా.. రోహిత్ శర్మ(119), కెప్టెన్ విరాట్ కోహ్లీ(89) అద్భుత ఇన్నింగ్స్‌ల ధాటికి ఇట్టే కరిగిపోయింది. స్మిత్ శతకం వృథా కాగా.. భారత్ 7 వికెట్లతో అలవోక విజయాన్నందుకుంది. 2-1తో సిరీస్‌ను కోహ్లీసేన సొంతమైంది. ఇక ఈ సిరీస్ అసాంతం ఆకట్టుకున్న విరాట్ ‌కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది.

ధోనీ రికార్డు బ్రేక్.. కెప్టెన్‌గా కోహ్లీ మరో సరికొత్త రికార్డు!!ధోనీ రికార్డు బ్రేక్.. కెప్టెన్‌గా కోహ్లీ మరో సరికొత్త రికార్డు!!

ఈ మ్యాచ్‌లో స్మిత్ వన్డేల్లో నాలుగువేల పరుగులు పూర్తి చేసుకోగా.. విరాట్ కోహ్లీ రికార్డు మోత మోగించాడు. కెప్టెన్‌గా వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన కెప్టెన్‌‌గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత సారథిగా రికార్డు సృష్టించాడు. ధోనీ 330 ఇన్నింగ్స్‌ల్లో 11,207 పరుగులు చేయగా..కోహ్లీ ఒక్క పరుగు ఎక్కువగా చేసి( 199 ఇన్నింగ్స్‌ల్లో 11,208 పరుగులు ) అతని రికార్డును బ్రేక్ చేసాడు.

ధోని రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీధోని రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ

లక్ష్య ఛేదనలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7,000 పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ (133 ఇన్నింగ్స్‌ల్లో) మరో రికార్డు నెలకొల్పాడు. ఛేజింగ్‌లో 7 వేలు అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 232 ఇన్నింగ్స్‌ల్లో 8,720 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, January 20, 2020, 19:42 [IST]
Other articles published on Jan 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X