న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా కత్తి విన్యాసం.. గడ్డి కోసుకోమన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Michael Vaughan, Ravindra Jadeja in funny banter after India stars sword-wielding video

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 'బ్యాట్ సాము' గురించి తెలియని వారుండరు. మైదానంలో హాఫ్ సెంచరీ కొట్టినా.. శతకం బాదినా జడ్డూ తనదైన శైలిలో కత్తిసాములా.. బ్యాట్‌ను తిప్పుతూ సంబరాలు చేసుకుంటాడు. అతని బ్యాట్ సామును కూడా ఇష్టపడే వారున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ జడ్డూలా బ్యాట్ సాము చేసిన ఓ త్రో బ్యాక్ వీడియోను షేర్ చేసి.. ఎలా ఉందని ఈ భారత ఆల్‌రౌండర్‌ను అడిగాడు. దీనికి జడ్డూ కూడా సూపర్ డేవిడ్.. అచ్చం నాలానే చేశావ్ అని కామెంట్ చేశాడు. దీంతో గత రెండు, మూడు రోజులుగా.. ఈ 'బ్యాట్‌సాము' పదం వార్తల్లో నిలిచింది.

ఈ సారి కత్తి విన్యాసం..

ఈ సారి కత్తి విన్యాసం..

తాజాగా జడేజా తన పెరిట్లో కత్తితోనే విన్యాసాలు చేశాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన స్టార్ క్రికెటర్లంతా ఫ్యామిలీతో సరదాగా ఉంటూ... ఇళ్లల్లో వారు చేసే చిలిపి పనులను షేర్ చేస్తున్నారు. ఇక బ్యాట్ సాము‌ ట్రెండింగ్ అయిన నేపథ్యంలో జడేజా జామ్‌నగర్‌లోని తన ఇంట్లో ఆదివారం కత్తితో విన్యాసాలు చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోకు ‘కత్తి దాని పదును కోల్పోవచ్చు.. కానీ తన సహజత్వంలో మాత్రం అది ఎప‍్పటికీ మాస్టరే'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఆ కత్తితో గడ్డి కోసుకో

ఆ కత్తితో గడ్డి కోసుకో

ఈ వీడియో చూసిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ఫన్నీ కామెంట్‌‌తో జడేజాను ట్రోల్ చేశాడు. 'ఇప్పుడు ఆ కత్తితో గడ్డి కోసే సమయం ఆసన్నమైంది రాక్ స్టార్'అంటూ కామెంట్ చేశాడు. దీనికి జడేజా అంగీకరిస్తూనే తనకు గడ్డిని కట్‌ చేయడం రాదంటూ బదులిచ్చాడు. ‘ అసలు నాకు గడ్డి కోయడంలో అనుభవం లేదు. ఎలా కట్‌ చేయాలో తెలియదు' అని కౌంటర్‌ ఇచ్చాడు. మైకేల్‌ వాన్‌ దగ్గర గడ్డిని కట్ చేయడం ఎలానో నేర్చుకుంటే పోలా అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

కెప్టెన్ అంటే ధోనీ.. పది మ్యాచుల్లో విఫలమైనా చోటు ఉంటుంది: ఆసీస్ మాజీ క్రికెటర్

గుర్రపు స్వారీ కూడా..

రాజవంశానికి చెందిన జడేజా గుర్రపు స్వారీ కూడా చేస్తాడు. అయితే కరోనా కారణంగా తనకెంతో ఇష్టమైన గుర్రపు స్వారీని చేయలేకపోతున్నానని జడేజా ఓ త్రో బ్యాక్ వీడియోను కూడా పంచుకున్నాడు. అనంతరం తన గురించి ఏం తెలుసుకోవాలో గుర్రం నేర్పిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. గుర్రంతో ఉన్న ఓ ఫొటోకు "నా గురించి నేను ఏం తెలుసుకోవాలో గుర్రం నాకు నేర్పింది" అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీనిపై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ స్పందించాడు. దేశంలో లాక్​డౌన్ పూర్తయ్యాక ఇద్దరం కలిసి గుర్రపు స్వారీ చేద్దామని చెప్పాడు. సిద్ధంగా ఉండాలంటూ జడేజాకు సూచిస్త ఓ ఫన్నీ ఎమోజీని జతచేశాడు. భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలున్నాయి. దీంతో ఏప్రిల్‌ 15కు వాయిదా పడ్డ 13వ సీజన్‌ ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్పష్టత కొరవడింది.

Story first published: Monday, April 13, 2020, 13:25 [IST]
Other articles published on Apr 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X