న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Michael Vaughan hails T Natarajan for acing yorkers in incredible last over

న్యూఢిల్లీ: ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో భారత్ అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే అందరూ రిషభ్ పంత్‌ అద్భుత బ్యాటింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (4/67) బౌలింగ్‌ గణాంకాలను మెచ్చుకుంటున్నారు. ఆఖరికి భారత్‌పై ఒంటరి పోరాటం చేసిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్ సామ్‌ కరన్‌ను సైతం కొనియాడుతున్నారు. అయితే, నరాలు తెగేంత ఉత్కంఠ మధ్య చివరి ఓవర్‌ వేసిన టి.నటరాజన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్ విజయానికి 6 బంతుల్లో 14 పరుగులు కావాల్సి ఉండగా.. అంతటి ఒత్తిడిలోనూ నటరాజన్‌ తన యార్కర్‌లతో మాయ చేశాడని వాన్‌ అభినందించాడు.

అదో కల..

అదో కల..

క్రిక్ బజ్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటరాజన్‌ను ఎంత అభినందించిన తక్కువేనన్నాడు. 'క్రికెట్‌లో వైట్ బాల్ రాజ్యమేలుతున్న తరుణంలో పరుగులివ్వకుండా కట్టడి చేయడం అద్భుతమైన నైపుణ్యం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20లు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆటగాళ్లు ఆడుతున్నారు. అయితే ఎంతమంది బౌలర్లు అద్భుతంగా యార్కర్లు విసరగలరో మీరు ఊహించగలరా? అలాంటి బంతులను వేయడం నిజంగా కష్టమే. ఏమాత్రం మిస్సయినా స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. తీవ్ర ఒత్తిడిలోనూ అలాంటి యార్కర్లను సంధించిన ఆటగాళ్లు లసిత్‌ మలింగ, బ్రెట్‌లీలను చూడవచ్చు.

అతని గుండెచప్పుడు..

అతని గుండెచప్పుడు..

మూడో వన్డేలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సామ్‌ కరన్‌కు నిజంగా అది క్లిష్టమైన పరిస్థితే. అప్పటికే నటరాజన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనూ తక్కువ ఎత్తులో సామ్‌కరన్‌ ప్యాడ్స్‌ తగిలేలా బంతిని విసిరాడు. లక్షల మంది మ్యాచ్‌ చూస్తున్న సమయంలో బౌలింగ్‌ చేస్తున్న నటరాజన్‌ గుండె చప్పుడు ఏంటో అతని ముఖంలో చూడొచ్చు. సరైన యార్కర్‌ వేసి మ్యాచ్‌ను గెలిపించిన నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువే' అని వాన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

యార్కర్లతో కట్టడి..

యార్కర్లతో కట్టడి..

ఈ మ్యాచ్‌లో తొలి 5 ఓవర్లు కట్టడిగా బౌలింగ్ చేసిన నట్టూ.. ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. లైన్ మిస్సవుతూ బంతుల వేస్తూ భారీగా పరుగులిచ్చుకున్నాడు. ఏకంగా 7 వైడ్లు వేసాడంటే అతని బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు కావాల్సిన సమయంలో అతనికి బౌలింగ్ ఇవ్వడం అందర్ని కొంత కలవరపాటుకు గురిచేసింది. కానీ ఐపీఎల్‌లో ఈ తరహా అనుభవం ఉండటంతో నట్టూ సూపర్ యార్కర్లతో జోరు మీదున్న సామ్‌కరన్‌ను కట్టడి చేశాడు. తొలి నాలుగు బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి భారత విజయాన్ని ఖాయం చేశాడు. ఇక ఐదో బంతిని సామ్ కరన్ బౌండరీ తరలించినా ఫలితం లేకపోయింది.

అదరగొట్టిన భారత్..

అదరగొట్టిన భారత్..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్‌ (67), పంత్‌ (78) హార్దిక్‌ (64) అర్ధ శతకాతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్‌వుడ్‌ (3/34), రషీద్‌ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడిన సామ్‌ కరన్‌ (95 నాటౌట్‌) భారత్‌ను భయపెట్టాడు. మలన్‌ (50) ఫర్వాలేదనిపించాడు. శార్దూల్‌ (4/67), భువనేశ్వర్‌ (3/42) కుమార్ సత్తాచాటారు.

Story first published: Monday, March 29, 2021, 18:23 [IST]
Other articles published on Mar 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X