
రోహిత్‌కు గట్టి సవాలే..
స్టార్ స్పోర్ట్స్ డిబేట్‌లో దాయాదీల పోరే ప్రతిష్టాత్మమైనదిగా అభివర్ణించారు. ముందు మైకేల్ వాన్ మాట్లాడుతూ.. ''ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లుగా యాషెస్ సిరీస్‌నే ప్రతిష్టాత్మక పోరుగా భావిస్తాం. అయితే అది తప్పు. భారత్ x పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచే అతిపెద్ద పోరు. రోహిత్ శర్మ సారథిగా అసలైన సవాల్‌ను ఎదుర్కోనున్నాడు. అప్‌కమింగ్ వరల్డ్ కప్ టోర్నీ ప్రత్యేకంగా నిలవనుంది'' అని తెలిపాడు.

చాలా క్రేజీగా ఉంటుంది..
భారత్, పాక్ మధ్య మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ అన్నాడు. 'దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటేనే క్రేజీగా ఉంటుంది. అందుకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక కావడం ఇంకా విశేషం. ఎంసీజీ అంటే నాకెంతో ఇష్టం. 2015 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాతో ఇక్కడే తలపడ్డాం.'' అని గుర్తు చేసుకున్నాడు.

ఈసారి భారత్‌దే విజయం..
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా చెలరేగుతుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. 'దాయాదుల మధ్య హోరాహోరీ పోరు ఉండటం ఖాయం. గత ప్రపంచకప్‌లో పది వికెట్ల తేడాతో భారత్‌పై పాక్ సునాయస విజయం సాధించింది. కాబట్టే ఈసారి టీమిండియా ప్రతికారంగా చెలరేగుతుందని భావిస్తున్నా'అని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.

గతేడాది చిత్తుగా..
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా.. పాక్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో కూడా పరాజయం పాలై సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. టీ20 ప్రపంచకప్ పోటీల్లో ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా.. భారత్ ఐదు సార్లు విజయం సాధించింది. అయితే ఈసారి రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా ఈమెగా టోర్నీ జరగనుంది.