ఫించ్.. నువ్వు ఆస్ట్రేలియా కెప్టెన్‌వి! ఐపీఎల్‌ విషయంలో అలా చెప్పడం సరికాదు: మైఖెల్‌ క్లార్క్‌

IPL 2021 Auction : Michael Clarke Questions Aaron Finch Snub At IPL 2021 Auction

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలంలో అమ్ముడుపోని టాప్ ఆట‌గాళ్ల‌లో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఉన్నాడు. గ‌త సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టు‌కు ఆడిన ఫించ్‌ను ఈసారి కోహ్లీసేన విడిచిపెట్టింది. అయితే ఈ నెల 18న చెన్నైలో జరిగిన వేలంలో ఫించ్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలుచేయలేదు. ఆస్ట్రేలియాకే చెందిన యువ ఆట‌గాళ్లు కోట్లు ప‌లికిన చోట‌.. టీ20 స్పెష‌లిస్ట్ అయిన ఫించ్‌ను తీసుకోక‌పోవ‌డం చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అయితే ఈ విష‌యాన్ని ఆసీస్ కెప్టెన్ మాత్రం చాలా తేలికగా తీసుకున్నాడు.

ఆశ్చర్యం కలిగించలేదు

ఆశ్చర్యం కలిగించలేదు

'నిజం చెప్పాలంటే.. ఐపీఎల్ 2021 వేలంలో నన్ను ఎవరూ కొనుగోలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు. ఇది ముందే ఊహించా. ఎప్పుడైనా క్రికెట్‌ ఆడటానికే ఇష్టపడతా. అయితే ఇంట్లో కొంత సమయం గడపడం కూడా మంచిదే. ఆగస్టులో ఇంగ్లండ్‌కు వెళ్లినప్పటి నుంచి తీరికలేకుండా ఆడుతున్నా. పలుమార్లు క్వారంటైన్‌, బయో బబుల్‌ లాంటి వాతావరణంలో గడిపా. కాబట్టి ఇప్పుడు ఇంట్లో సమయం గడిపితే పునరుత్తేజితం కావొచ్చు' అని ఆరోన్ ఫించ్ తాజాగా పేర్కొన్నాడు.

ముందే ఊహించానని చెప్పడం సరికాదు

ముందే ఊహించానని చెప్పడం సరికాదు

ఆరోన్ ఫించ్ వ్యాఖ్యలపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖెల్‌ క్లార్క్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'టీ20ల్లో నువ్వు ఆస్ట్రేలియా కెప్టెన్‌వి. ప్రతి ఫ్రాంఛైజీ నిన్ను తీసుకోవాలనే ఆలోచనతోనే ఉండాలి. ఒక్కోసారి సరిగ్గా ఆడకపోయినా ఫర్వాలేదు. కానీ నువ్వెంత గొప్ప ఆటగాడివనే విషయం తెలిస్తే.. నీ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఒకవేళ బీబీఎల్‌లో సరిగ్గా ఆడకపోయినా.. తర్వాతి టోర్నీల్లో భారీ ఇన్నింగ్స్‌తో లెక్క సరిచేస్తా అని చెప్పాలి. అంతేకానీ ఇలా నన్నెవరూ తీసుకోరని ముందే ఊహించానని చెప్పడం సరికాదు' అని క్లార్క్‌ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2020లో విఫలం

ఐపీఎల్ 2020లో విఫలం

గ‌తేడాది రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున 12 మ్యాచ్‌లు ఆడిన ఆరోన్ ఫించ్.. 268 ప‌రుగులు మాత్రమే చేశాడు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అదరగొట్టిన చోట ఫించ్ విఫలమయ్యాడు. ఒకరి రెండు మ్యాచులు తప్పా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తర్వాత బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ తేలిపోయాడు. ఈ క్రమంలోనే గతవారం జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఏ ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2020లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్ చేరి ఇంటిదారి పట్టిన విషయం తెగెలిసిందే.

పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే

పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే

ఆరోన్ ఫించ్ పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల టీమిండియాతో ముగిసిన నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో ఫించ్ ఆడలేదు. టీమిండియాతో ఫించ్ సారథ్యంలో ఆడిన ఆసీస్ వన్డే సిరీస్ నెగ్గి, టీ20 సిరీస్ ఓడిపోయింది. ఫించ్ ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. తొలి మ్యాచులో ఆసీస్ ఓడిపోయింది.

ముగ్గురు భారత ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, February 23, 2021, 16:34 [IST]
Other articles published on Feb 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X