న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముగ్గురు భారత ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌!!

Vijay Hazare Trophy: Three players test positive for Coronavirus

ముంబై: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. విజయ్‌ హజారే ట్రోఫీలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర జట్లకు చెందిన ఒక్కో ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కరోనా సోకినా ముగ్గురు ఆటగాళ్లను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉందని, వారికీ ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం.

మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఆటగాడికి కరోనా

మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఆటగాడికి కరోనా

మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ఆటగాడికి గతవారం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. సోమవారం మాత్రం ఇద్దరికీ పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచారు. ఒకరితో మరొకరు కలవద్దని ఆదేశించారు. ఇరు జట్ల ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించిన తర్వాతే.. వారిని తదుపరి మ్యాచ్ ఆడేందుకు అనుమతిస్తారు. అయితే కరోనా సోకిన ఆటగాళ్ల పేర్లను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు.

బీహార్ ఆటగాడికి పాజిటివ్

బీహార్ ఆటగాడికి పాజిటివ్

ఇక బీహార్ ఆటగాడికి పాజిటివ్‌ రావడం ఇదే మొదటిసారి. బీహార్ సోమవారం కర్ణాటకతో మ్యాచ్ ఆడింది. దీంతో ఇరు జట్లను మంగళవారం పరీక్షించాల్సి ఉంది. ప్రస్తుతం అందరూ ఐసోలేషన్‌లో ఉన్నారు. 'RT-PCR టెస్ట్ అయ్యే వరకు ఐసోలేషన్‌లో ఉండాలని బీసీసీఐ అధికారులు ఆదేశించారు' అని బీహార్ ఆటగాడు ఓ జాతీయ మీడియాతో చెప్పాడు. ప్రస్తుతం మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ జట్లు జైపూర్‌లో ఉండగా.. బీహార్ జట్టు బెంగళూరులో ఉంది.

ఇదే మొదటిసారి కాదు

ఇదే మొదటిసారి కాదు

దేశీయ క్రికెట్‌లో భారత క్రికెటర్లకు కరోనా సోకడం ఇదే మొదటిసారి కాదు. గతవారమే మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌కు ప్లేయర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇరు జట్లలోని ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఓ క్రికెటర్‌కు కరోనా సోకింది. ఇక ఐపీఎల్ 2020 సందర్భంగా చాలా మందికి పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అయితే అందరూ త్వరగా కోలుకోవడం సంతోషించాల్సిన విషయం. అన్ని టోర్నీలు బయో బబుల్ వాతావరణంలో జరుగుతున్న విషయం తెలిసిందే.

బయో బబుల్ వాతావరణంలోనే టెస్ట్ సిరీస్

బయో బబుల్ వాతావరణంలోనే టెస్ట్ సిరీస్

మరోవైపు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మూడో మ్యాచ్ బుధవారం నుంచి అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ప్రారంభం కానున్నది. డే/నైట్ టెస్ట్ కోసం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఫ్ల‌డ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ కూడా బయో బబుల్ వాతావరణంలో జరుగుతుంది.

Day/night Test: పింక్‌బాల్‌ టెస్ట్ గెలిచి.. సిరీస్‌ను కైవసం చేసుకుంటాం: ఆర్చర్‌

Story first published: Tuesday, February 23, 2021, 15:53 [IST]
Other articles published on Feb 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X