న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!

 Chahar, Boult and Bumrah derail Hyderabad chase as Mumbai win by 13 runs

చెన్నై: బలహీనమైన బ్యాటింగ్‌ లైనప్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి గెలిచే మ్యాచ్‌లో ఓడింది. ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు ఆరెంజ్ ఆర్మీ నిలబడలేకపోయింది. రోహిత్ సేన కట్టుదిట్టమైన బౌలింగ్‌, అద్భుత ఫీల్డింగ్‌తో 137 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ.. 13 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), క్వింటన్ డికాక్(39 బంతుల్లో 5 ఫోర్లు 40), కీరన్ పొలార్డ్(22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో విజయ్ శంకర్(2/19), ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/29) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.4 ఓవర్లలో 137 రన్స్‌కు ఆలౌటైంది. జానీ బెయిర్ స్టో(22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43), డేవిడ్ వార్నర్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) మినహా అంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్ మూడేసి వికెట్లు తీయగా.. పాండ్యా, బుమ్రా తలో వికెట్ దక్కించుకున్నారు.

చెలరేగిన జానీ భాయ్..

చెలరేగిన జానీ భాయ్..

151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో మంచి శుభారంభాన్ని అందించారు. తొలి రెండు ఓవర్లు డిఫెన్స్‌కే పరిమితమైన ఈ జోడీ.. అనంతరం గేర్ మార్చింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో జానీ బెయిర్ స్టో వరుస బంతుల్లో 4, 4, 6, 4 బాది 18 పరుగులు పిండుకున్నాడు. మిల్నే వేసి ఆ మరుసటి ఓవర్‌లో వార్నర్ ఫోర్ కొట్టగా.. జానీ భాయ్ రెండు వరు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. బెయిర్ స్టో జోరును అడ్డుకునేందుకు రోహిత్.. కృనాల్‌ను తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఆ ఓవర్‌లో జానీ ఓ సిక్స్ బాదగా.. వార్నర్ ఫోర్ కొట్టాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 57 రన్స్ చేసింది.

వార్నర్ రనౌట్..

వార్నర్ రనౌట్..

ఆ తర్వాత కూడా బెయిర్ స్టో అదే రీతిలో ఆడాడు. అయితే కృనాల్ పాండ్యా వేసిన 8 ఓవర్ రెండో బంతికి బెయిర్ స్టో హిట్ వికెట్ కావడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(2)పేలవ షాట్‌తో పెవిలియన్ చేరగా.. క్రీజులోకి వచ్చిన విరాట్ సింగ్‌తో వార్నర్.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సూపర్ ఫీల్డింగ్‌కు వార్నర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో హైదరాబాద్ పతనం మొదలైంది.

మలుపు తిప్పిన హార్దిక్ పాండ్యా..

మలుపు తిప్పిన హార్దిక్ పాండ్యా..

దీపక్ చాహర్ వేసిన 15వ ఓవర్‌లో విరాట్ సింగ్(11), అభిషేక్ శర్మ(2) ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ రెండు భారీ సిక్సర్లు కొట్టి ఆశలు రేకెత్తించాడు. అతనికి జతగా అబ్దుల్ సమద్ కూడా బౌండరీ బాడాడు. కానీ హార్దిక్ పాండ్యా మరోసారి తన మెరుపు ఫీల్డింగ్‌తో సమద్‌ను రనౌట్ చేశాడు. ఆ వెంటనే రషీద్ ఖాన్(0) ఎల్బీగా వెనుదిరగ్గా.. విజయ్ శంకర్( 25 బంతుల్లో 28) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేారాడు. చివరి ఓవర్లలో భువనేశ్వర్ (1), ఖలీల్ అహ్మద్(1) బౌల్డ్ అవ్వడంతో రెండు బంతులు మిగిలుండగానే హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Sunday, April 18, 2021, 7:11 [IST]
Other articles published on Apr 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X