న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ ఫైనల్ వరల్డ్ కప్ టైటిల్ ఫైట్‌ లాంటిదే.. గెలవాలంటే ఒక్క తప్పు చేయద్దు: పొలార్డ్

MI vs DC: Kieron Pollard says IPL final is the biggest thing after World Cup final

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే టైటిల్ ఫైట్‌లో ఢిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, ఫస్ట్ టైమ్ ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత అంతటి మ్యాచ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ ఫైనలేనని ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అన్నాడు. ఫైనల్ అనగానే ప్రతి ఒక్కరు ఒత్తిడికి లోనవుతారని, చిన్న తప్పిదం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని సహచరులను హెచ్చరించాడు. ఈ మెగా ఫైట్ నేపథ్యంలో ఈ విండీస్ వీరుడు మాట్లాడిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది.

'ఫైనల్ అంటేనే ఒత్తిడి. ప్రతీ ఒక్కరు ఒత్తిడికి గురవుతారు. విజయం దక్కాలంటే ఏ ఒక్క చిన్న తప్పిదం కూడా చేయవద్దు. మాములు మ్యాచ్‌లానే ముగించాలి. సాధారణంగా మైదానంలోకి బరిలోకి దిగి ఆటను ఆస్వాదించాలి. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో క్రౌడ్ లేదు. ప్రపంచకప్ ఫైనత్ తర్వాత అంత గొప్పగా భావించే100'అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ మ్యాచ్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దనే అన్నాడు. మరో క్రికెట్ మ్యాచ్‌లానే భావిస్తున్నామని తెలిపాడు. 'క్రికెట్‌లో ఇది మరో గేమ్ మాత్రమే. మేం ఎక్కువగా ఆలోచించడం లేదు. మా విధానాలను కొనసాగిస్తూ మా నైపుణ్యాలను ప్రదర్శిస్తాం. ఇది కేవలం బ్యాట్, బంతి, పరుగులు,వికెట్ మధ్య జరిగే ఆసక్తిపోరు మాత్రమే. ఈ కాంటెస్ట్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాం'అని జయవర్దనే తెలిపాడు.

ఈ సీజన్‌లో పొలార్డ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అవసరమైనప్పుడల్లా తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. అటు బంతితోనూ మెరిసాడు. ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో దూరమైనా తాత్కలిక సారథిగా పొలార్డ్ అదరగొట్టాడు.

కంగ్రాట్స్ నట్టూ.. ఆస్ట్రేలియాలో కలుద్దాం: డేవిడ్ వార్న్కంగ్రాట్స్ నట్టూ.. ఆస్ట్రేలియాలో కలుద్దాం: డేవిడ్ వార్న్

Story first published: Tuesday, November 10, 2020, 14:55 [IST]
Other articles published on Nov 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X