న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs CSK match 1: చెలరేగిన చెన్నై బౌలర్లు.. సాధారణ స్కోర్‌కే పరిమితమైన ముంబై!

MI vs CSK match 1: Lungi Ngidi, spinners restrict Mumbai Indians to 162 for 9

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందుకొని ముంబైని సాధారణ స్కోర్‌కే కట్టడి చేశారు. వారి బౌలింగ్‌కు ఫాఫ్ డూప్లెసిస్ కళ్లు చెదిరే ఫీల్డింగ్ తోడవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆ జట్టులో సౌరభ్ తివారీ(31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సి‌క్స్‌తో 42), క్వింటన్ డికాక్(20 బంతుల్లో 5 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రోహిత్ శర్మ(12), హార్దిక్ పాండ్యా(14), కృనాల్ పాండ్యా(3), కీరన్ పొలార్డ్(18) దారుణంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. చాహర్, జేడేజా రెండేసి వికెట్ల పడగొట్టారు. చావ్లా, సామ కరన్ చెరొక వికెట్ లభించింది. అయితే స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఇది పోరాడే స్కోరే.

ఫోర్‌తో షురూ..

ఫోర్‌తో షురూ..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ప్రారంభించారు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్.. తన ఆటను ధాటిగానే మొదలుపెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని కవర్ అండ్ పాయింట్ దిశగా రోహిత్ బౌండరీకి తరలించాడు. అనంతరం కూడా ఈ ఇద్దరు ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకున్న డికాక్ బౌండరీలతో రఫ్ఫాడించాడు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీని పియూష్ చావ్లా దెబ్బతీసాడు.

అతను వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతిని రోహిత్ మిడాఫ్ దిశగా షాట్‌కు ప్రయత్నించి సామ్ కరణ్ చిక్కాడు. దీంతో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్ ఇన్నింగ్స్ 12 పరుగులకే ముగిసింది. ఆ వెంటనే సామ్ కరన్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(33) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

సిక్సర్ల ఖాతా తెరిచిన సౌరభ్ తివారీ..

సిక్సర్ల ఖాతా తెరిచిన సౌరభ్ తివారీ..

అనంతరం క్రీజులోకి వచ్చిన సౌరభ్ తివారీ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వస్తూ వస్తూనే ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే సౌరబ్ తివారీ జడేజా వేసిన 9వ ఓవర్ రెండో బంతిని భుజబలంతో లాంగా దిశగా భారీ షాట్ ఆడి ఈ సీజన్ సిక్సర్ల ఖాతాను తెరిచాడు. అయితే చెన్నై బౌలర్లు చెలరేగడంతో ఈ జోడీ తడబడింది. స్కోర్ బోర్డ్ మందగించి ఒత్తిడి పెరిగింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్ కరన్ చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా జడేజా వేసిన 12 ఓవర్ 5,6 బంతుల్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి రన్‌రేట్ మెరుగుపరిచాడు.

డూప్లెసిస్ సూపర్ ఫీల్డింగ్..

డూప్లెసిస్ సూపర్ ఫీల్డింగ్..

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఫాఫ్ డూప్లెస్ పట్టిన రెండు క్యాచ్‌లు మ్యాచ్‌కే హైలైట్ అయ్యాయి. దాదాపు సిక్స్‌గా వెళ్లిన రెండు బంతులను డూప్లెసిస్ సూపర్ ఫీల్డింగ్‌తో అందుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 15వ ఓవర్ తొలి బంతిని సౌరభ్ తివారీ( 42)భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డూప్లెసిస్ గాల్లోకి అమాంతం ఎగిరి అందుకున్నాడు. దీంతో సౌరభ్ తివారీ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఇదే ఓవర్ ఐదో బంతిని హార్దిక్ పాండ్యా లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడగా ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తు డూప్లెసిస్ మళ్లీ అద్భుతంగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. దీంతో హార్దిక్(14) భారంగా పెవిలియన్ చేరాడు. అనంతరం కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Sunday, September 20, 2020, 8:06 [IST]
Other articles published on Sep 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X