న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్న సచిన్.. ఫొటోలు తీసిన యువరాజ్

Memories came flooding back today: Sachin Tendulkar on his SCG visit with Yuvraj Singh

సిడ్నీ: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సీజీ)లో తనకున్న మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని టీమిండియా లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ఎస్‌సీజీ స్టేడియంలో తన పేవరేట్ స్పాట్ అంటూ మురిసిపోయిన మాస్టర్.. నాటి మధుర క్షణాలు కళ్ల ముందు కదలాడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

పీసీబీపై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్.. ఏం చేయాలో కూడా తెలియకపోతే ఎలా?పీసీబీపై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్.. ఏం చేయాలో కూడా తెలియకపోతే ఎలా?

బుష్ ఫైర్ బాధితుల సహాయార్థం క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహిస్తున్న చారిటీ మ్యాచ్‌లో భాగమయ్యేందుకు సచిన్ టెండూల్కర్, మరో మాజీ క్రికెటర్ యువ రాజ్ సింగ్ సిడ్నీకి వెళ్లారు. ఎస్‌సీజీ చేరుకున్న కాసేపటికే సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. వీటిని యువరాజ్ సింగ్ తీయడం విశేషం. స్టేడియం డ్రెస్సింగ్‌ రూంలో తన పేవరెట్ స్పాట్‌ను చూసుకుని మురిసిపోయిన సచిన్ ఒకప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. 'ఎస్‌సీజీ డ్రెస్సింగ్ రూములో ఇదే నా ఫేవరెట్ కార్నర్. నాటి జ్ఞాపకాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి'అని ఆ ఫొటోలకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

'బుష్‌ఫైర్' చారిటీ మ్యాచ్‌లో రికీపాంటింగ్ ఎలెవన్ జట్టుకు సచిన్ కోచ్‌గా, ఆడం గిల్‌క్రిస్ట్ జట్టు తరఫున యువరాజ్ సింగ్ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌ షెడ్యూల్‌ మార్చడంతో.. స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ ఈ చారిటి మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. దీంతో జట్టు బాధ్యతలను గిల్‌క్రిస్ట్‌ అందుకోన్నాడు. ముందే చేసుకున్న ఒప్పందాల కారణంగా ఈ చారిటీ మ్యాచ్ ఆడలేకపోతున్నట్టు షేన్ వార్న్ ప్రకటించాడు. కాగా, చారిటీ మ్యాచ్ రేపు (శనివారం) జరగాల్సి ఉండగా, సిడ్నీలో కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా మ్యాచ్‌ను ఆదివారానికి వాయిదా వేశారు. దిగ్గజ క్రికెటర్లు తలపడే ఈ మ్యాచ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని 'బుష్‌ఫైర్' బాధితులకు ఇవ్వనున్నారు.

Story first published: Friday, February 7, 2020, 19:52 [IST]
Other articles published on Feb 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X