న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Punjab Kings:శిఖర్ ధావన్‌కు చుక్కెదురు.. కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్

Mayank Agarwal appointed Punjab Kings captain instead of Shikhar Dhawan

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చుక్కెదురైంది. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలను గబ్బర్ స్వీకరిస్తాడని అంతా భావించగా.. ఆ టీమ్ మేనేజ్‌మెంట్ ధావన్‌కు మొండి చెయ్యి చూపించింది. బెంగళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో రూ.8.25 కోట్ల అతి తక్కువ ధరకే శిఖర్ ధావన్‌ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్.. అతనికే టీమ్ పగ్గాలు అందిస్తుందని అంతా భావించారు. కానీ తమ పాత ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌కే సారథ్యాన్ని కట్టబెట్టింది. ఈ మేరకు పంజాబ్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు పంజాబ్ మయాంక్ అగర్వాల్‌తో పాటు అర్షదీప్ సింగ్‌ను రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత రిచెస్ట్ ఫ్రాంచైజీగా మెగా వేలం బరిలోకి దిగిన పంజాబ్.. శిఖర్ ధావన్ తో పాటు జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్ స్టోన్, కగిసో రబడ వంటి స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

ఇక 2011లో ఢిల్లీ డెర్‌డెవిల్స్‌ తరుపున మయాంక్ అగర్వాల్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు.అనంతరం ఆర్‌సీబీకి ఆడిన మయాంక్ అగర్వాల్.. 2018 మెగా వేలంలో పంజాబ్‌కు మారాడు. ఈ మెగా వేలానికి ముందు అతన్ని రూ. 12 కోట్లకు పంజాబ్‌ రిటైన్ చేసుకుంది. పంజాబ్‌ కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై మయాంక్‌ హర్షం వ్యక్తం చేశాడు. 'నేను 2018 నుంచి పంజాబ్ కింగ్స్‌ జట్టులో భాగమై ఉన్నాను. పంజాబ్‌ లాంటి ప్రతిష్టాత్మక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం లభించడం చాలా గౌరవంగా భావిస్తున్నా. నేను ఈ బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను 'అని మయాంక్‌ అగర్వాల్‌ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మార్చి 26 నుంచి మే 29 వరకు జరగనుంది.

పంజాబ్ పూర్తి జట్టు ఇదే..
మయాంక్ అగర్వాల్(రూ.12 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్(రూ.4 కోట్లు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.11.50 కోట్లు), కగిసో రబడా(రూ.9.25 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ.6.75 కోట్లు), ఓడిన్ స్మిత్(రూ.6 కోట్లు), రాహుల్ చాహర్(రూ.5.25 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్(రూ.3.80 కోట్లు), రాజ్ అంగడ్ బావ(రూ.2 కోట్లు), వైభవ్ అరోరా(రూ.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ.75 లక్షలు), ప్రభ్ సిమ్రన్ సింగ్(రూ.60 లక్షలు), రిషీ ధావన్(రూ.55 లక్షలు), సందీప్ వర్మ(రూ.50 లక్షలు), భానుక రాజపక్స(రూ.50 లక్షలు), బెన్ని హోవల్(రూ.40 లక్షలు), ఇషాన్ పోరెల్(రూ.25 లక్షలు), జితేశ్ శర్మ(రూ.20 లక్షలు), ప్రేరక్ మన్కండ్(రూ.20 లక్షలు), అథర్వ టైడ్(రూ.20 లక్షలు), వ్రిట్టిక్ చటర్జీ(రూ.20 లక్షలు), బాల్‌తేజ్ ధండా(రూ.20 లక్షలు), అన్ష్ పటేల్(రూ.20 లక్షలు)

Story first published: Monday, February 28, 2022, 13:16 [IST]
Other articles published on Feb 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X