న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ ఆ బ్యాట్‌తో మాత్రం ఆడొద్దన్నాడు: ఆసీస్ మాజీ ప్లేయర్

 Matthew Hayden reveals MS Dhoni’s reaction on his mongoose bat

సిడ్నీ: ఏం కావాలన్నా ఇస్తా.. కానీ ఆ మంగూస్ బ్యాట్ మాత్రం వాడొద్దని ధోనీ తనకు సూచించాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూహెడెన్ తెలిపాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఈ విధ్వంసకర ప్లేయర్.. 2010లో ఢిల్లీ డేర్ డేవిల్స్‌పై 43 బంతుల్లో 7 సిక్స్‌లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. అదే తన ఫేవరెట్‌ ఐపీఎల్‌ మూమెంట్‌ అని రైనా ఇటీవల చెప్పుకొచ్చాడు.

మంగూస్ బ్యాట్‌తో సక్సెస్..

మంగూస్ బ్యాట్‌తో సక్సెస్..

అయితే ఆ ఇన్నింగ్స్‌ను ఆడిన క్రమంలో హెడెన్ మంగూస్‌ బ్యాట్‌ను ఉపయోగించాడు. పొడవాటి హ్యాండిల్‌తో పాటు ఆ బ్యాట్‌ బ్లేడ్‌ కుదించినట్లు ఉండటమే దీని ప్రత్యేకత. చాలా సందర్భాల్లో మంగూస్‌ బ్యాట్‌ను ఉపయోగించి హెడెన్‌ సక్సెస్‌ అయ్యాడు. అయితే ఆ బ్యాట్‌‌తో ఆడటానికి చెన్నై సారథి ధోనీ అంగీకరించలేదని ఈ ఆసీస్ స్టార్ తెలిపాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రజెంటర్ రుపా రమణితో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న హెడెన్‌ ఈ విషయాన్న వెల్లడించాడు.

ధోనీని ఇబ్బంది పెట్టలేక..

ధోనీని ఇబ్బంది పెట్టలేక..

‘ఢిల్లీతో నాటి మ్యాచ్ తర్వాత మంగూస్‌ బ్యాట్‌ను ఉపయోగించడానికి ధోనీ ఒప్పుకోలేదు. ఆ బ్యాట్‌ను ఏ మాత్రం ఉపయోగించవద్దన్నాడు. నీకు కావాల్సిందేదైనా ఇస్తాను కానీ ఆ బ్యాట్ మాత్రం వాడవద్దని ధోనీ సూచించాడు. ఇది రిస్క్‌తో కూడుకున్న అంశం కాబట్టే ధోనీ అలా చెప్పాడు. నా ఫ్రాంచైజీని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ధోనీ సూచనను పాటించా.

ఎంత ప్రయోజనమో.. అంతే ప్రమాదం..

ఎంత ప్రయోజనమో.. అంతే ప్రమాదం..

దాదాపు ఏడాదిన్నర కాలం మంగూస్‌ బ్యాట్‌ను ప్రాక్టీస్‌లో ఉపయోగించా. ఆ బ్యాట్‌ 20 మీటర్లు ముందుకు ఉంటుంది. పొడవైన హ్యాండిల్‌ ఉండటంతో బంతిని ముందుగానే హిట్‌ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అంచనా తప్పితే ఔటయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇదే విషయాన్ని ధోనీ నొక్కి చెప్పాడు. ఫ్రాంచైజీని కష్టపెట్టకూడదనే ఉద్దేశంతో ఆ బ్యాట్‌ను ఉపయోగించడం ఆపేశా. మంగూస్‌ బ్యాట్‌ను వాడటం మాత్రం సాహసోపేతమే.

చాలా ఇష్టమైన బ్యాట్

నా గేమ్‌ మెరుగవుతుందనే దీన్ని ఉపయోగించా. ఆ బ్యాట్‌తో ఆడిన సందర్బాలు చాలానే ఉన్నాయి. మంగూస్‌ బ్యాట్‌తో ఆడటం నాకు చాలా ఇష్టం. ఆ బ్యాట్‌తో ఆడటం సరదాగా ఉంటుంది. ఇంటి దగ్గర మాత్రం మంగూస్‌ బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేసేవాడిని' అని హేడెన్‌ తెలిపాడు. ఈ వీడియోను సీఎస్‌కే తన అధికారికి ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.

సచిన్‌పై టాంపరింగ్ అభియోగాలు.. ఆరుగురి భారత ఆటగాళ్లపై సస్పెన్షన్.. అట్టుడికిన పార్లమెంట్!

Story first published: Saturday, May 9, 2020, 13:15 [IST]
Other articles published on May 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X