న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ అనుభవం పనికొస్తుంది: సౌతాఫ్రికా కోచ్

Mark Boucher Says Having Faf du Plessis in squad is a good headache

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు భారత గడ్డపై మంచి అవగాహన ఉందని ఆ జట్టు కోచ్‌ మార్క్‌బౌచర్‌ తెలిపాడు. ఇది తమకు కలిసొస్తుందన్నాడు. గురువారం నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సఫారీలు తొలి వన్డే జరిగే ధర్మశాలకు చేరుకున్నారు. భారత్‌కు వచ్చే ముందు బౌచర్‌ మీడియాతో మాట్లాడాడు. భారత గడ్డపై ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్‌ అనుభవం తమకు కలిసివస్తుందని చెప్పాడు.

భారత్‌తోనే రీ ఎంట్రీ..

భారత్‌తోనే రీ ఎంట్రీ..

గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో చివరిసారి వన్డే ఆడిన డుప్లెసిస్‌ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ భారత్‌తో జరిగే తాజా సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఫాఫ్ విఫలమయ్యాడు. భారత్‌కు వెళితే జూనియర్లు, సీనియర్లతో సమన్వయం చేసుకోవాలని, వన్డేల్లో డుప్లెసిస్‌ బాగా రాణిస్తాడని బౌచర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే అతడికి భారత పరిస్థితులపై మంచి అవగాహన ఉందన్నాడు. మాజీ సారథి జట్టుతో కలవడం ఉపయోగకరమని, అతడి అనుభవం కలిసివస్తుందని చెప్పాడు. పరిస్థితులను బట్టి తుది జట్టుని తీసుకుంటామన్నాడు. ఇదివరకు భారత్‌లో అతడికి మంచి రికార్డు ఉందని బౌచర్‌ గుర్తుచేశాడు.

ఆర్సీబీకీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం.. ఐపీఎల్‌ రద్దు చేయాలని కేంద్రానికి లేఖ!!

ఆత్మవిశ్వాసం పెరిగింది..

ఆత్మవిశ్వాసం పెరిగింది..

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉన్నందున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ముఖ్యమని, ఈ ఫార్మాట్‌లో తమ జట్టు మెరుగయ్యేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాను వన్డేల్లో చిత్తు చేయడంతో తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చాడు. మరోవైపు భారత్‌లో పరిస్థితులు వేరేలా ఉంటాయన్నాడు. తమ జట్టులోని చాలా మందికి ఇక్కడ ఆడిన అనుభవం లేదని, కానీ ఇటీవలి కాలంలో వారికిచ్చిన బాధ్యతల్లో మెరుగ్గా రాణించారని తెలిపాడు.

చేతులు కలపం..

చేతులు కలపం..

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? అని ప్రశ్నించగా..'మేం కరచాలనం చేయాలో వద్దో ఆలోచిస్తున్నాం. వైరస్‌ మా ప్లేయర్లకు సోకకుండా ఉండేందుకు కరచాలనం చేయకపోవడమే మంచిదైతే మానేస్తాం' అని బౌచర్‌ సమాధానం ఇచ్చాడు. వైద్య, భద్రతా సిబ్బంది అనుమతించిన తర్వాతే క్రికెట్‌ ఆడేందుకు వెళ్తున్నామని స్పష్టం చేశాడు.'మాకు వైద్య సిబ్బంది ఉన్నారు. వైద్యపరంగా ఏమైనా అవసరం ఉంటే వారికి తెలియజేస్తాం. వారు సూచనలు చేస్తారు. మరీ ప్రమాదకరంగా ఉంటే వారే మమ్మల్ని వెళ్లొద్దంటారు. గత రాత్రి వైద్యసిబ్బంది మాకు వైరస్‌ గురించి పూర్తిగా వివరించారు. మేం వాళ్ల సూచనలు పాటిస్తాం. సిబ్బంది సరైన సహాయం చేస్తారని మాకు నమ్మకముంది' అని బౌచర్‌ చెప్పుకొచ్చాడు.

పాండ్యా, ధావన్ ఆగయా..

పాండ్యా, ధావన్ ఆగయా..

ఈ నెల 12, 15, 18న భారత్, సౌతాఫ్రికా మూడు వన్డేల్లో తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు ఈ సిరీస్‌కు టీమ్స్‌ను ప్రకటించాయి. గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.

Story first published: Tuesday, March 10, 2020, 16:21 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X