న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీకీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం.. ఐపీఎల్‌ రద్దు చేయాలని కేంద్రానికి లేఖ!!

 Karnataka Government Denies To Host IPL Matches Due To Coronavirus Outbreak
IPL 2020 : Karnataka Government Denies to Host IPL Matches Due To Coronavirus Outbreak | Oneindia

బెంగళూరు: దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) సెగ ఐపీఎల్‌ 2020 సీజన్‌కు తగిలింది. ఓవైపు రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈ క్యాష్‌రిచ్ లీగ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకోగా.. మరోవైపు బీసీసీఐ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్-13వ సీజన్ జరుగుతుందని రోజుకో ప్రకటన విడుదల చేస్తుంది.

బీసీసీఐ ఎన్ని చెప్పినా..

బీసీసీఐ ఎన్ని చెప్పినా..

స్వయంగా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ క్యాచ్ రిచ్ లీగ్‌పై వస్తున్న ఊహాగానాలను ఖండిస్తున్నా.. ఈ మెగాలీగ్ నిర్వహించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు జంకుతున్నాయి. మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్‌ను వాయిదా వేయాలనగా.. నేడు కర్ణాటక ప్రభుత్వం తాము ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను నిర్వహించమని ప్రకటించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది.

ధోనీనా మజాకా.. శతృదేశం కూడా అభిమానించాల్సిందే !!

కర్ణాటకలో తొలి కరోనా కేసు..

ఇక సోమవారం కర్ణాటకలో తొలి కరోనా కేసు నమోదైన విషయం తెలిసిందే. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా బెంగళూరుకు వచ్చిన ఓ టె కీకి(40) కరోనా పాజిటివ్ వచ్చింది. అతన్ని వెంటనే రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అయితే రోగి పరిస్థితి నిలకడగా ఉందంటున్న అధికారులు..ముందస్తుగా అతని భార్య, పిల్లలను కూడా ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. అతని సహోద్యోగులు, ఫ్లైట్‌ లో అతని ముందు వెనకా ప్రయాణించి వారు, అతనితో సంబంధాలు కలిగి ఉన్నమరో 2666మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఇవాళ్టి నుంచి బెంగళూరులోని అన్ని స్కూళ్లను మూసివేశారు.

ఐపీఎల్ నిర్వహించం బాబోయ్..

ఐపీఎల్ నిర్వహించం బాబోయ్..

కరోనా కేసు నమోదవ్వడంతో ఐపీఎల్‌‌ను నిర్వహించమని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు స్థానిక దిగ్విజయ్ 24/7 చానెల్ పేర్కొంది. అంతేకాకుండా వీలైతే ఐపీఎల్ 2020 సీజన్‌ను రద్దు చేయాలని లేకుంటే.. వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కూడా తెలిపింది. ఏదిఏమైనా తాము ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మ్యాచ్‌లపై గందరగోళం నెలకొంది.

మహారాష్ట్ర ప్రభుత్వం కూడా...

మహారాష్ట్ర ప్రభుత్వం కూడా...

రెండు రోజుల క్రితం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపె కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ వాయిదా వేయడమే ఉత్తమమన్నాడు. 'ప్రజలు ఎక్కువ సంఖ్యలో గమిగూడితే.. వైరస్‌ ప్రభావం దారుణంగా ఉంటుంది. ఇలాంటి టోర్నీలు తర్వాత కూడా నిర్వహించుకోవచ్చు' అని మంత్రి మీడియా సమావేశంలో అన్నారు. ఐపీఎల్‌ను వాయిదా వేయాలనే విషయంపై అధికార వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకొని వెల్లడిస్తారని మంత్రి చెప్పారు.

Story first published: Tuesday, March 10, 2020, 15:10 [IST]
Other articles published on Mar 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X