న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరుగు తీస్తూ ఢీకొట్టుకున్న బ్యాట్స్‌మన్.. తప్పిన ప్రమాదం (వీడియో)

Marcus Stoinis and Nick Larkin collide while taking a single

మెల్‌బోర్న్ : సంచలనాలకు, విచిత్ర ఘటనలకు ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ కేరాఫ్ అడ్రస్. ముగింపునకు చేరుకున్న ఈ మెగా టోర్నీలో గురువారం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన చాలెంజర్స్ మ్యాచ్‌లో సింగిల్స్ తీస్తు ఇద్దరు బ్యాట్స్‌మన్ ఒకరికొకరు ఢీకొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్‌బోర్న్ స్టార్స్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ మార్కస్ స్టోయినిస్, ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ నిక్ లార్కిన్ పరుగు తీస్తూ ఒకరికొకరు ఢీకొన్నారు. అదృష్టవశాత్తు ఎవరికి గాయాలవ్వకున్నా.. క్రికెట్ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది.

నా సెంచరీకి.. జోష్‌కు ద్రవిడ్ సర్ వీడియోనే కారణం: యశస్వి జైస్వాల్నా సెంచరీకి.. జోష్‌కు ద్రవిడ్ సర్ వీడియోనే కారణం: యశస్వి జైస్వాల్

జోనాథన్ కుక్ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి స్టోయినిస్ లాంగాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే ఇక సింగిల్ తీసి డబుల్‌కు ప్రయత్నించిన స్టోయినిస్, నిక్ బంతినే చూస్తూ పరుగెత్తారు. అయితే ఈ క్రమంలో ఒకరినొకరు చూసుకోకుండా ఢీకొట్టుకున్నారు. అయితే మరీ స్పీడ్‌గా పరుగెత్తకపోవడంతో గాయాల నుంచి తప్పించుకున్నారు. అలాగే ఫీల్డర్లు అలసత్వంగా ఉండటం కూడా వారికి కలిసొచ్చింది. రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అనంతర చెలరేగి ఆడిన ఈ జోడీ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. స్టోయినిస్(83) హాఫ్ సెంచరీ చేసి ఔటవ్వగా.. నిక్ కూడా 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో మెల్‌బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది.

నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?నువ్వేం అంపైర్ సామీ.. ఇంత బిత్తిరి నిర్ణయమా?

అనంతరం ఛేజింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగలే చేసి ఓటమిపాలైంది. ఇక 28 పరుగులతో గెలిచిన మెల్‌బోర్న్ స్టార్స్ శనివారం జరిగే ఫైనల్లో సిడ్నీ సిక్సర్‌తో తలపడుతుంది. ఇక బీబీఎల్ చరిత్రలో ఒక్క సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా స్టోయినిస్ రికార్డు సృష్టించాడు.

Story first published: Thursday, February 6, 2020, 20:38 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X