న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

March 18: భారత క్రికెట్‌ చరిత్రలోనే మరిచిపోలేని రోజు.. ఆ లాస్ట్ బాల్ సిక్స్ అయితే సూపరో సూపర్!

March 18: On this day Sachin Tendulkars last ODI, Virat Kohli Super Century and Dinesh Karthiks last-ball six

హైదరాబాద్: మార్చి 18 భారత క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని దినం.! అవును ఈ రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు అద్భుతాలు భారత్ క్రికెట్‌లో చోటు చేసుకున్నాయి. ఒకటి ఉత్కంఠకే ఊపిరి అందనివ్వని సందర్భం అయితే మరొకటి మనస్సును తేలిక పరిచేది. ఇంకొకటి కాస్త బాధను మిగిల్చిన ఘటన!

సరిగ్గా 9 ఏళ్ల క్రితం ఇదే రోజు ఓ క్రికెట్ శిఖరం తన ఆట‌కు వీడ్కోలు పలకగా.. అదే మ్యాచ్‌లో ఓ యువ ఆటగాడు మెరుపులు మెరిపించాడు. మూడేళ్ల క్రితం మళ్లీ ఇదే రోజు భారత అభిమానులకు మరిచిపోలేని అద్భుత క్షణాలను మిగిల్చింది. ఆ క్రికెట్ శిఖరం సచిన్ టెండూల్కర్ అయితే.. ఆ యువ కెరటం విరాట్ కోహ్లీ.! ఇక మధురానుభూతిని మిగిల్చింది మాత్రం దినేష్ కార్తీక్.!

చివరి బంతికి సిక్స్ కొట్టి..

చివరి బంతికి సిక్స్ కొట్టి..

2018 మార్చి 18.. బంగ్లాదేశ్‌తో నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు అద్భుత విజయాన్నందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పుణ్యమా భారత్ విజయాన్నందుకుంది. రోహిత్ సేన గెలవాలంటే ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. క్రీజులో దినేశ్ కార్తీక్.. బౌలర్‌గా సౌమ్యా సర్కార్. ఉత్కంఠకే ఊపిరందని క్షణం. విజయం ఎవరినో వరిస్తుందో తెలియని సందర్భం. ఈ క్లిష్ట స్థితిలో తన అనుభవాన్నంత రంగరించిన దినేశ్ కార్తీక్ అద్భుత సిక్సర్ కొట్టాడు.

ఒక్కసారిగా భారత శిభిరంలో ఆనందం.. ఆ క్షణం యావత్ భారతానికి దినేశ్ కార్తీక్‌ హీరో అయ్యాడు. ఈ ఒక్క సిక్స్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో(అప్పటికి) రాని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ మ్యాచ్‌లో కార్తీక్ 8 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ పెర్ఫామెన్స్ అతన్ని 2019 వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లోకి తీసుకునేలా చేసింది.

సూపర్ రెడ్డి.. ధోనీతో ఫొటో దిగితే చాలనుకున్నావ్.. అతని లెగ్ స్టంపే ఎగరగొట్టేసావ్! (వీడియో)

మరిచిపోలేని రాత్రి..

తనకు అంతటి పేరు తెచ్చి పెట్టిన ఆ సిక్స్‌ను దినేశ్ కార్తీక్ నెమరు వేసుకున్నాడు. ఆ సిక్స్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. 'మరిచిపోలేని రాత్రి'అనే క్యాప్షన్‌ను ఇచ్చాడు. నిజానికి ఆ సిరీస్‌లో భారత్ యువ ఆటగాళ్లతో బరిలోకి దిగినప్పటికి.. బంగ్లాదేశ్ అత్యుత్సాహంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారి నాగినీ డ్యాన్స్‌లకు యావత్ క్రికెట్ ప్రపంచం చికాకుకు గురైంది. దాంతో పసికూన బంగ్లాదేశ్‌పై భారత్ విజయాన్ని అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు.

సచిన్ ఆఖరి వన్డే..

సచిన్ ఆఖరి వన్డే..

9 ఏళ్ల క్రితం( 2012 మార్చి 18) ఇదో రోజు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి వన్డే ఆడాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. పాక్ నిర్ధేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలుండగానే చేధించింది. తన ఆఖరి వన్డేలో సచిన్(52) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ కెరటం విరాట్ కోహ్లీ (183) పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా భారత్ సునాయస విజయాన్నందుకుంది. ఇక ఈ టోర్నీలోనే సచిన్ బంగ్లాదేశ్‌పై శతకం చేసి 100 సెంచరీలను పూర్తి చేసుకున్నాడు.

Story first published: Thursday, March 18, 2021, 17:27 [IST]
Other articles published on Mar 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X