న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేవుడా..ఈ పాక్ క్రికెటర్లకు కొంచెం బుద్ది ప్రసాదించు, కుళ్లుతో రగిలిపోతున్నారు: భారత క్రికెటర్

Manoj Tiwary blasts Pakistan cricketers for their recent comments

న్యూఢిల్లీ: అవకాశం దొరికిన ప్రతిసారి భారత్‌ క్రికెట్‌ బోర్డుపై విద్వేషం వెళ్లగక్కుతున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్లపై టీమిండియా బ్యాట్స్‌మన్ మనోజ్ తివారి మండిపడ్డాడు. వారికి కొంచెం బుద్ది ప్రసాదించాలని సోషల్ మీడియావేదికగా ఆ దేవుణ్ణి ప్రార్థించాడు. ఇక సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే తివారీ ప్రతి అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లో నెపోటిజమ్‌పై గళమెత్తిన హీరోయిన్ కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలిచాడు.

మ‌నం చేసిన క‌ర్మ ఎప్ప‌టికైనా తిరిగి మ‌న వ‌ద్ద‌కే చేరుతుందన్నాడు. తాజాగా టీ20 ప్రపంచకప్ వాయిదా వెనుక భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) హస్తం ఉందని ఆరోపించిన అక్తర్‌తో పాటు జోఫ్రా ఆర్చర్‌ను తప్పుబట్టిన సల్మాన్ బట్‌, విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ కాపీ కొట్టాల్సిన అవసరం పాక్‌కు లేదన్న వకార్‌ యూనిస్‌పై ఇన్‌స్టా వేదికగా మండిపడ్డాడు.

 ఇంత ఈర్ష్యా, కుళ్లునా.?

ఇంత ఈర్ష్యా, కుళ్లునా.?

ఈ ముగ్గురి వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోలను స్లైడ్స్‌గా షేర్ చేసిన మనోజ్ తివారీ.. ‘ఈ వ్యాఖ్యలన్నీ కుళ్లు, ఈర్ష్యతోనే వచ్చాయి. సల్మాన్ బట్.. నియమ, నిబంధనల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మీకు ఆ దేవుడు కొంత బుద్దిని ప్రసాదించాలని కోరుతున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కరెక్ట్ చెప్పావ్ తివారీ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక భారత్ తరఫున 12 వన్డేలు, 3టీ20లు ఆడిన తివారీ అదృష్ట కలిసిరాక స్టార్ క్రికెటర్‌గా ఎదగలేకపోయాడు.

బీసీసీఐ బెదిరిస్తే బెరురుతారా?

బీసీసీఐ బెదిరిస్తే బెరురుతారా?

ఇక టీ20 ప్రపంచకప్ వాయిదా బీసీసీఐ కుట్రేనన్న అక్తర్.. మంకీగేట్ వివాదం తరహాలోనే క్రికెట్ ఆస్ట్రేలియాను భారత బోర్డు బెదిరించిందన్నాడు. ‘మెల్‌బోర్న్‌లో కొన్నిసార్లు వాళ్లు సులువుగా వికెట్లు సాధిస్తారు. మరికొన్ని సార్లు ఒకతను (హర్భజన్) వేరొకర్ని కోతి అని పిలిచి సేవ్ అవుతాడు. ఒకవేళ అలా జరగకపోతే..? అప్పుడు సిరీస్‌ని బహిష్కరించడంపై చర్చ తెరపైకి వస్తుంది. నేను ఆస్ట్రేలియా (క్రికెట్ బోర్డు) వాళ్లని అడుగుతున్నా.. మీకు విలువలు ఉన్నాయా..? బంతిని (సాల్ట్ పేపర్‌తో) గోకినందుకు మీ క్రికెటర్లని నిషేధంతో ఏడిపించారు. కానీ.. కోతి అని పిలిచినవాళ్లని మాత్రం వదిలేశారు. సిరీస్‌ని బహిష్కరిస్తామని బీసీసీఐ వార్నింగ్ ఇవ్వగానే.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎలాంటి వివాదం జరగలేదంటూ కప్పిపుచ్చింది. ఐపీఎల్‌కి ఉన్న అడ్డంకుల్ని తొలగించడానికే టీ20 వరల్డ్‌కప్‌ని బీసీసీఐ వాయిదా వేయించింది' అని అక్తర్ విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆర్చర్ తప్పు చేశావ్..

ఆర్చర్ తప్పు చేశావ్..

ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ బట్.. ఆర్చర్ రూల్స్‌ను బ్రేక్ చేయాల్సింది కాదని కామెంట్ చేశాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన సల్మాట్ బట్ కూడా నిబంధనలు గురించి మాట్లాడుతున్నారని చాలా మంది నెటిజన్లు మండిపడ్డారు. తివారీ కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ కౌంటరిచ్చాడు.

 కోహ్లీని కాపీ చేయలేం..

కోహ్లీని కాపీ చేయలేం..

ఇక గతేడాది ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓడిన తర్వాత పాక్ తీవ్ర ట్రోలింగ్ గురైంది. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో ఆవలింతలు తీసిన సర్ఫరాజ్ మహ్మద్ ఫొటోను కోహ్లీ ఫిట్‌నెస్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ ఎగతాళి చేశారు. అయితే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను పాకిస్థాన్ జట్టు ఎప్పటికీ కాపీ చేయలేదని, స్వంతగా శక్తిసామర్థ్యాలు పెంపొందించుకోవాలని ఆ జట్టు మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ సూచించాడు. ఈ కామెంట్స్‌ను తివారీ తప్పుబట్టాడు.

టూ పీస్ బికినీలో టెన్నిస్ స్టార్ ఒసాకా.. మండిపడుతున్న ఫ్యాన్స్

Story first published: Tuesday, July 28, 2020, 11:49 [IST]
Other articles published on Jul 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X