Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టూ పీస్ బికినీలో టెన్నిస్ స్టార్ ఒసాకా.. మండిపడుతున్న ఫ్యాన్స్

Naomi Osaka Slams People Asking Her To Maintain Innocent Image On Her Swimsuit Pics

న్యూయార్క్‌: జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌ నవోమి ఒసాకా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. అందుకు కారణం.. ఆమె బికినీ ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమే. టూ పీస్‌ బికినీలో దర్శనమిస్తున్న ఆమె ఫొటోలను చూసిన అభిమానుల్లో కొందరు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈ జపాన్ టెన్నిస్ స్టార్ కూడా స్పందించింది.

అమయాకురాలివి అనుకున్నాం..

‘నీ ముఖం చాలా అమాయకంగా ఉంటుందని, నువ్విలా ప్రవర్తిస్తావ్ అనుకోలేదు'అని ఒకరంటే.. ‘నువ్వు అమాయకురాలైన అమ్మాయిలా ఉండడం మాకిష్టం. ఇతరులను అనుకరించకు'అని ఇంకొకరు కామెంట్ చేశారు. కరోనాతో ఆటకు బ్రేక్ రావడంతో ఒసాకకు ఇతర వ్యాపకాలపై దృష్టిపడిందని ఘాటుగా రిప్లే ఇచ్చారు.

నా డ్రెస్సింగ్‌పై మీ అభ్యంతరం ఏంటి..?

నా డ్రెస్సింగ్‌పై మీ అభ్యంతరం ఏంటి..?

ఈ కామెంట్స్‌పై ఓసాక కూడా ఫైర్ అయింది. ‘నేను అమాయకంగా ఉండాలని మీరెందుకు అనుకుంటున్నారు? నాకిప్పుడు 22 ఏళ్లు. పూల్‌లో స్విమ్ చేసేందుకు సూట్ వేసుకున్న. నేను ధరించే దుస్తులపైనా కామెంట్లు చేస్తున్నారు. ఇది సరికాదు.' అని ఒసాకా ఘాటుగా రిప్లై ఇచ్చింది.

అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా

అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా

మే నెలలో గత ఏడాది సంపాదన ఆధారంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా నవోమీ ఒసాకా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికన్‌ దిగ్గజం సెరీనా విలియమ్స్‌ను వెనక్కినెట్టి మరీ ఆమె అగ్రస్థానంలో నిలిచింది. రూ.284.20 కోట్లతో (37.4 మిలియన్‌ డాలర్లు) ఒసాకా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎండార్సుమెంట్లు, ప్రైజ్‌మనీ రూపంలో సెరెనా కంటే రూ.10.64 కోట్లు (1.4 మిలియన్‌ డాలర్లు) సంపాదించింది.

షరపోవాను దాటేసి...

షరపోవాను దాటేసి...

ప్రపంచ 10వ ర్యాంకర్ ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుపొందింది. ఇప్పటివరకు రష్యా క్రీడాకారిణి షరపోవా పేరుతో ఉన్న రికార్డును ఆమె అధిగమించింది. షరపోవా 2015లో 29.7 మిలియన్‌ డాలర్లు సంపాదించింది. ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న 100 మంది అథ్లెట్లతో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది.

బీసీసీఐలో పదవీకాలం పూర్తయిన దాదా దారెటు?

Story first published: Tuesday, July 28, 2020, 9:39 [IST]
Other articles published on Jul 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+