న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే కేన్‌ మామ ఆడటం లేదు.. ఆఖరి నిమిషంలో కెప్టెన్ అయ్యా: మనీశ్ పాండే

Manish Pandey reveals why Kane Williamson miss out vs MI

అబుదాబి: మోచేతి గాయంతో ఆఖరి నిమిషంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కలిక సారథి మనీశ్ పాండే తెలిపాడు. వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ కూడా వేలిగాయంతో బాధపడుతున్నాడని, దాంతో ఆఖరి నిమిషంలో తాను సారథ్య బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మనీష్ పాండే.. హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు. టాస్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మనీశ్ పాండే మైదానంలోకి రావడం చూసి అంతా షాకయ్యారు.

దాంతో కెప్టెన్‌గా తాను రావడానికి గల కారణాన్ని మనీశ్ పాండే వెల్లడించాడు. 'ఐపీఎల్‌లో కెప్టెన్‌గా నా మొదటి మ్యాచ్. చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమిది. కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. భువనేశ్వర్‌‌కు ఫింగర్ ఇంజ్యూర్ అయింది. మేం ఫస్ట్ బ్యాటింగ్ చేయాలనుకున్నాం. కానీ బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముంబై ధాటిగా ఆడేందుకు ప్రయత్నిస్తుందని తెలుసు. ఆ జట్టును అడ్డుకునేందుకు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నాం'అని పాండే తెలిపాడు. ఇక జట్టులోకి మహమ్మద్ నబీ వచ్చాడన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నవ్వూతూనే తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇక ప్లే ఆఫ్స్ లెక్కలు చూస్తే భయమవుతుందని, కానీ మా సాయశక్తులా ప్రయత్నిస్తామన్నాడు. గేమ్‌ను ఆస్వాదించడం ముఖ్యమని చెప్పాడు. ఈ సీజన్‌ తమకు కలిసి రాలేదని, కొన్ని మ్యాచ్‌లు గెలిచి మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓడిపోయామన్నాడు. యూఏఈ వేదికగా సమష్టిగా రాణించలేకపోయామని, బ్యాటింగ్‌లో విఫలమయ్యామన్నాడు. జట్టులో రెండు మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయన్నాడు.

ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి 171 పరుగుల భారీ తేడాతో గెలవాలి. దాంతోనే టాస్ గెలిచిన వెంటనే రోహిత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇది అసాధ్యం కాబట్టి ముంబై లీగ్ నుంచి తప్పుకున్నట్లే. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

తుది జట్లు:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్: జేసన్‌ రాయ్‌, అభిషేక్ శర్మ, మనీశ్ పాండే (కెప్టెన్‌), ప్రియమ్‌ గార్గ్‌, జేసన్ హోల్డర్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), మహమ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌, అబ్దుల్‌ సమద్‌, సిద్దార్థ్‌ కౌల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

ముంబై ఇండియన్స్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్), సూర్యకుమార్ యాదవ్‌, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్‌ నీషమ్‌, కీరన్‌ పొలార్డ్‌, నాథన్ కౌల్టర్ నైల్, పియూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌.

Story first published: Friday, October 8, 2021, 20:08 [IST]
Other articles published on Oct 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X