న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతడి మైండ్ దొబ్బింది': టిమ్ పైన్ డీఆర్ఎస్ నిర్ణయం వల్లే ఆసీస్ ఓడిందా?

Lost His Brain: Ian Chappell Slams Australia Captain Tim Paine For DRS Blunder

హైదరాబాద్: "అతడి మైండ్ దొబ్బింది" లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఇయాన్ చాపెల్ చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలవాల్సి ఉంది. అయితే, ఆ జట్టుని దురదృష్టం వెంటాడింది.

దీంతో టిమ్‌ పైనీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా టిమ్ పైన్ తీసుకున్న నిర్ణయాలే ఆ జట్టుని ఓడించేలా చేశాయి. ఇంగ్లాండ్‌ 11వ బ్యాట్స్‌మన్ జాక్‌ లీచ్‌ ఔటవ్వడంపై టిమ్ పైన్ డీఆర్‌ఎస్‌కు వెళ్లడాన్ని మండిపడుతున్నారు. "పైన్‌కు మైండ్ మతిపోయినట్లుంది" అని చాపెల్ మండిపడ్డాడు.

<strong>యూపీ యోధపై సూపర్ విక్టరీ.. టాప్‌లో దబాంగ్‌ ఢిల్లీ</strong>యూపీ యోధపై సూపర్ విక్టరీ.. టాప్‌లో దబాంగ్‌ ఢిల్లీ

మార్క్ టేలర్ సైతం

మార్క్ టేలర్ సైతం

మరో మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ సైతం "అనవసరంగా రివ్యూని వృథా చేసుకున్నాడు" అని విమర్శించాడు. ఈ సందర్భంగా చాపెల్ మాట్లాడుతూ "బంతి లీచ్ ప్యాడ్‌ని తాకింది. అది క్లియర్‌గా నాటౌట్‌గా కనిపిస్తుంది. అయితే, ఆస్ట్రేలియన్లు రివ్యూని కోరారు" అని చానెల్ నైన్ ప్రత్యక్ష ప్రసారంలో విమర్శించాడు.

పైనీకి మతిభ్రమించింది

పైనీకి మతిభ్రమించింది

"పైనీకి మతిభ్రమించింది. లీచ్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లడం ఏమిటి. అది క్లియర్‌గా లెగ్‌ సైడ్‌కు వెళుతున్నట్లు కనిపిస్తుంది. అటువంటి సమయంలో ఉన్న ఒక్క రివ్యూను ఎలా వాడతాడు. అది ఔట్‌ కాదనే విషయం సహచర క్రికెటర్లకు అర్థమైంది. కానీ పైనీ మాత్రం ఏకపక్షంగా రివ్యూకు వెళ్లి అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు" అని మండిపడ్డాడు.

సోషల్ మీడియాలో వైరల్: యాషెస్ సిరిస్‌లోనే ఆల్‌టైమ్ బెస్ట్ వీడియో!

రివ్యూకు వెళ్లి దానిని కోల్పోవడంతో

రివ్యూకు వెళ్లి దానిని కోల్పోవడంతో

లీచ్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లి దానిని కోల్పోవడంతో ఆ తర్వాత బెన్ స్టోక్స్‌ ఔట్‌పై రివ్యూకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇంగ్లాండ్‌ స్కోరు 342 వద్ద కమిన్స్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను హారిస్‌ చేజార్చాడు. 357 వద్ద లీచ్‌ను అత్యంత తేలిగ్గా రనౌట్‌ చేసే అవకాశాన్ని లయాన్‌ వదిలేశాడు. అదే స్కోరు వద్ద బెన్ స్టోక్స్‌ ఎల్బీ కోసం లయాన్‌ చేసిన అప్పీల్‌ను అంపైర్‌ విల్సన్‌ తిరస్కరించాడు.

బ్రతికి పోయిన బెన్ స్టోక్స్

బ్రతికి పోయిన బెన్ స్టోక్స్

అప్పటికీ ఆస్ట్రేలియా రివ్యూలు అయిపోవడంతో బెన్ స్టోక్స్‌ బ్రతికి పోయాడు. అయితే, బంతి మిడిల్‌ వికెట్‌కు వెళుతున్నట్లు రిప్లేలో తేలింది. అదే, ఆస్ట్రేలియాకు రివ్యూ గనుక ఉండి ఉంటే స్టోక్స్ ఔటయ్యేవాడు. దీంతో మూడో టెస్టులో విజయం సాధించేది. ఇప్పుడు అలా జరగపోవడంతో టిమ్ పైన్‌పై మాజీలు మండిపడుతున్నారు.

359 పరుగుల లక్ష్య ఛేదనలో

359 పరుగుల లక్ష్య ఛేదనలో

ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో బెన్ స్టోక్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. 11వ బ్యాట్స్‌మన్ లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించగా అందులో స్టోక్స్‌వే 74 పరుగులు ఉండటం విశేషం.

Ashes 2019: సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన వార్నర్ (వీడియో)

సెప్టెంబర్ 4 నుంచి నాలుగో టెస్టు

సెప్టెంబర్ 4 నుంచి నాలుగో టెస్టు

టెస్టుల్లో చివరి వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై కుశాల్‌ పెరీరా, విశ్వ ఫెర్నాండో జోడీ దక్షిణాఫ్రికాపై 78 పరుగులు చేసింది. యాషెస్‌ నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి జరుగుతుంది.

Story first published: Monday, August 26, 2019, 13:32 [IST]
Other articles published on Aug 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X