న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2019: సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన వార్నర్ (వీడియో)

Ashes 2019 : David Warner Takes Incredible Catch To Dismiss Joe Root On Day 4 || Oneindia Telugu
Watch: David Warner Takes Incredible Catch To Dismiss Joe Root On Day 4

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో ఆదివారం లీడ్స్ వేదికగా జరిగిన మూడోటెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సూపర్ మ్యాన్‌లా క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ 78వ ఓవర్లో నాథన్ లయాన్‌ వేసిన మూడో బంతి జో రూట్‌ బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది.

<strong>Ashes 2019: స్టోక్స్ సెంచరీతో యోషెస్ మూడో టెస్టులో బద్దలైన రికార్డులివే!</strong>Ashes 2019: స్టోక్స్ సెంచరీతో యోషెస్ మూడో టెస్టులో బద్దలైన రికార్డులివే!

అయితే, స్టంప్స్‌ వెనక ఉన్న వికెట్‌ కీపర్‌ దాన్ని అందుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న డేవిడ్ వార్నర్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో జో రూట్‌ 77 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. వార్నర్‌ పట్టిన క్యాచ్‌ వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు తన ట్విటర్‌‌లో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది.

కాగా, ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 156/3తో ఆదివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌‌కు ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 219 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 135 నాటౌట్‌‌గా నిలిచి ఒంటి చేత్తో ఇంగ్లాండ్‌కు అపురూప విజయాన్ని అందించాడు.

ఇంగ్లాండ్‌ ఒకానొక దశలో చేసిన పరుగులు 286/9. ఇంగ్లాండ్ అభిమాని సైతం కలలోనైనా ఊహించి ఉండడు తమ జట్టు గెలుస్తుందని, కానీ, బెన్ స్టోక్స్‌ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరి బ్యాట్స్‌మన్‌ లీచ్‌ను కాపాడుకుంటూ, కంగారూలకు షాకిచ్చాడు.

100 పరుగులకే విండీస్‌ అలౌట్.. 318 పరుగులతో భారత్‌ ఘన విజయం100 పరుగులకే విండీస్‌ అలౌట్.. 318 పరుగులతో భారత్‌ ఘన విజయం

స్టోక్స్‌ సెంచరీతో రాణించడంతో పాటు ఆఖరి వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లాండ్‌ వికెట్ తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. యాషెస్‌ నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి జరుగుతుంది.

Story first published: Monday, August 26, 2019, 12:47 [IST]
Other articles published on Aug 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X