సోషల్ మీడియాలో వైరల్: యాషెస్ సిరిస్‌లోనే ఆల్‌టైమ్ బెస్ట్ వీడియో!

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించిన బెన్ స్టోక్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో మళ్లీ అద్భుతం చేశాడు. 219 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 135 నాటౌట్‌గా నిలిచి ఒంటి చేత్తో ఇంగ్లాండ్‌కు అపురూప విజయాన్ని అందించాడు.
ఈ క్రమంలో బెన్ స్టోక్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో బెన్ స్టోక్స్ జట్టుకు విజయాన్ని అందించడంపై ఇంగ్లాండ్ అభిమానుల అనందానికి అవధుల్లేకుండా పోయింది. ముఖ్యంగా మ్యాచ్‌ని వీక్షిస్తోన్న అభిమానులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.

ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్
359 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 156/3తో ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్.. ఆట ప్రారంభంలోనే కీలకమైన కెప్టెన్ జో రూట్ (77) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్టోక్స్‌కు బెయిర్‌స్టో (36) అండగా నిలవడంతో ఓ దశలో 245/4తో మెరుగ్గానే కనిపించింది. అయితే, వరుసగా ఐదు వికెట్లు బట్లర్ (1), వోక్స్ (1), ఆర్చర్ (15), బ్రాడ్ (0) కోల్పోయింది.
Ashes 2019: సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టిన వార్నర్ (వీడియో)

286 వద్ద 9వ వికెట్ పడిన దశలో
286 వద్ద 9వ వికెట్ పడిన దశలో మరో 73 పరుగులు చేయాల్సి ఉండటంతో ఆతిథ్య జట్టు కథ ముగిసినట్లే అనిపించింది. మ్యాచ్‌ని వీక్షిస్తోన్న సగటు ఇంగ్లాండ్ అభిమాని సైతం తమ జట్టు గెలుస్తుందని ఊహించి ఉండడు. అలాంటిది ఆఖరి బ్యాట్స్‌మన్ జాక్ లీచ్ (17 బంతుల్లో 1 నాటౌట్) మద్దతుగా నిలవగా స్టోక్స్ రెచ్చిపోయాడు. టి20 తరహాలో స్కూప్ షాట్లు, రివర్స్ స్వీప్‌లు ఆడుతూ సెంచరీని సాధించాడు.

పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించిన స్టోక్స్
ఈ క్రమంలో లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 357 పరుగుల వద్ద లీచ్ ఓవర్ మొదటి నుంచీ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఒత్తిడిని అధిగమిస్తూ
ఎట్టకేలకు మూడో బంతికి అతడు సింగిల్ తీయడంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్‌లో స్టోక్స్ బౌండరీ బాదడంతో చరిత్రాత్మక విజయం ఇంగ్లాండ్ సొంతమైంది.
స్టోక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు: యాషెస్ మూడో టెస్టు హైలెట్స్
భావోద్వేగానికి లోనైన అభిమానులు
ఓడిపోతుందని అనుకున్న టెస్టులో ఇంగ్లాండ్ అనూహ్య విజయం సాధించడంతో మైదానంలోని ప్రేక్షకుల ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. స్టోక్స్ ఫోర్ బాదగానే ఒక్కసారిగా మైదానంలో లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. బెన్ స్టోక్స్ సైతం ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. అనంతరం నెటిజన్లు స్టోక్స్‌ను హీరోగా అభివర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications