న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 Auction: మోరిస్‌ను అందుకే భారీ ధరకు తీసుకున్నాం.. అతడి పాత్రపై పూర్తి స్పష్టత ఉంది: సంగక్కర

Kumar Sangakkara revels why Rajasthan Royals spent ₹16.25 crore on Chris Morris

కొలొంబో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) వేలంలో అత్యధిక ధర పలికిన దక్షిణాఫ్రికా క్రిస్‌ మోరిస్ పోషించాల్సిన పాత్రపై స్పష్టత ఉందని రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ కుమార సంగక్కర తెలిపాడు. యువపేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు అతడు బౌలింగ్‌లో సాయంగా ఉంటాడని పేర్కొన్నాడు. మోరిస్ రాకతో జోఫ్రాను మరింత సమర్థంగా ఉపయోగించకోగలిగే అవకాశం ఉంటుందన్నాడు. గురువారం జరిగిన వేలంలో మోరిస్‌ను రాజస్థాన్ రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

 అది బోనసే కదా:

అది బోనసే కదా:

'బలంగా, ఫిట్‌నెస్‌తో ఉన్నప్పుడు క్రిస్ మోరిస్‌ గణాంకాలు ఐపీఎల్‌లో అత్యుత్తమంగా ఉన్నాయి. అతడో అద్భుతమైన డెత్‌ బౌలర్‌ అని చెప్పొచ్చు. తన తెలివితేటలతో మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తాడు. దాంతో ఆర్చర్‌ను మేం సమర్థంగా వినియోగించుకొనేందుకు అవకాశం దొరుకుతుంది. అంతేకాకుండా మాకు ఆండ్రూ టై, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, ఇంకా భారత యువ పేసర్లు ఉన్నారు. వీరిని ఎంచుకున్నప్పుడు జట్టు కూర్పులో మోరిస్‌ కీలకమవుతాడు. ఇక అతడి బ్యాటింగ్‌తో పరుగులు వస్తే బోనసే కదా' అని కుమార సంగక్కర తెలిపాడు.

ఆర్చర్‌పై ఒత్తిడి తగ్గుతుంది:

ఆర్చర్‌పై ఒత్తిడి తగ్గుతుంది:

'జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన ఫాస్ట్ ‌బౌలర్‌. ఆట కొనసాగే ప్రతి దశలో మేం అతడిని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం. మోరిస్‌ రావడంతో అతడిపై ఒత్తిడి తగ్గుతుంది. బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా ఆడకుండా అతడు బౌలింగ్‌ చేయగలుగుతాడు. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, క్రిస్ మోరిస్‌లలో ఎవరో ఒకరు అతడికి అండగా నిలుస్తారు. మాకు శివమ్‌ దూబె తక్కువ ధరకే లభించాడు. ఎడమతిచేవాటం ఆటగాడైన అతడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలకు మరింత బలం చేకూరుస్తాడు. జోస్‌ బట్లర్‌ విధ్వంసకర ఓపెనర్‌. ఇది అందరికి తెలుసు. అయితే అతడు ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేయగలడు' అని సంగా వెల్లడించాడు.

యువరాజ్‌ రికార్డు‌ బద్దలు:

యువరాజ్‌ రికార్డు‌ బద్దలు:

గురువారం జరిగిన ఐపీఎల్ 2021‌ వేలంలో సంచలనాలు నమోదయ్యాయి. యువరాజ్‌ సింగ్‌ అత్యధిక ధర రికార్డును క్రిస్‌ మోరిస్‌ బద్దలు కొట్టాడు. మోరిస్‌ను కొనుగోలు చేసేందుకు ఈ సారి ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి ప్రదర్శించాయి. రూ.75 లక్షల కనీస ధరలో ఉన్న అతడి కోసం ఢిల్లీ, ముంబై, పంజాబ్‌, రాయల్స్‌ పోటీపడ్డాయి. చివరికి రాజస్థాన్‌ రూ.16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సమయోచితంగా వికెట్లు తీయడమే కాకుండా.. భారీ సిక్సర్లు బాదగలగడం మోరిస్‌ ప్రత్యేకత. అతడు జట్టుకు అత్యంత సమతూకం తీసుకొస్తాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 77 మ్యాచులు ఆడిన మోరిస్‌ 551 పరుగులు చేశాడు. 79 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2020లో 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. గతేడాది రూ.10 కోట్లు వెచ్చించిన బెంగళూరు ఈసారి తక్కువ ధరకు అతడిని దక్కించుకోవాలని ప్రయత్నించి భంగపడింది.

India vs England: అశ్విన్‌, కుల్‌దీప్‌, పాండ్యా 'వాతి' స్టెప్పులు (వీడియో)!!

Story first published: Saturday, February 20, 2021, 13:21 [IST]
Other articles published on Feb 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X