India vs England: అశ్విన్, కుల్‌దీప్, పాండ్యా 'వాతి' స్టెప్పులు (వీడియో)!!

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌పై రెండో టెస్టు గెలిచాక భారత ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన కోహ్లీసేన తర్వాతి టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది. అయితే మూడో టెస్టు ఈనెల 24న అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరగనుండటంతో ఇప్పటికే ఇరు జట్లూ అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. ఈ క్రమంలో వారికి వారం రోజుల విశ్రాంతి దొరకడంతో భారత ఆటగాళ్లు సంతోషంగా గడుపుతున్నారు.
వాతి పాటకు స్టెప్పులు:
తాజాగా రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాలోని వాతి పాటకు స్టెప్పులేశాడు. అందులో అశ్విన్‌తో పాటు హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్‌లు కూడా కాలు కదిపారు. మొతేరా స్టేడియంలోని జిమ్‌లో వీరంతా ఉత్సాహంగా చిందులేశారు. ఇది చూసి వాతి సంతోషపడతాడంటూ అశ్విన్ పేర్కొనడం గమనార్హం. కాగా ఈ చెన్నై స్పిన్నర్ రెండో టెస్టులో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన యాష్ బ్యాటింగ్‌లోనూ శతకంతో మెరిశాడు. దీంతో భారత్ సిరీస్‌లో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

అవకాశం వస్తుందో:
తొలి టెస్టులో అవకాశం రాని కుల్‌దీప్ యాదవ్ రెండో టెస్టులో తక్కువ ఓవర్లే బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్ రాణించడంతో కుల్‌దీప్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక భారత్ కీలక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు జట్టుకు ఎంపికైనా.. తుది జట్టులో ఇంకా అవకాశం రాలేదు. మరి బుధవారం నుంచి ప్రారంభమయ్యే డే/నైట్ టెస్టులోనైనా అతడికి అవకాశం వస్తుందో లేదో వేచిచూడాలి.

యాష్ అన్న ఇన్ ది ఆస్ చెపాక్ మాస్టర్:
అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. విజయ్ నటించిన 'మాస్టర్' పోస్టర్‌ను ఎవరో మార్ఫింగ్ చేసి.. అశ్విన్ ఫొటోను అతికించారు. 'యాష్ అన్న ఇన్ ది ఆస్ చెపాక్ మాస్టర్' అని టైటిల్ పెట్టారు. 'బౌలింగ్ అండ్ బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ బై రవిచంద్రన్ అశ్విన్' అని టాగ్ లైన్ కూడా జత చేశాడు. ఆ ఫొటో నెట్టింట వైరల్ అయింది. ఆ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. 'ఇలా ఎవరు చేశారు?' అని ప్రీతి పోస్ట్ చేశారు. అంతేకాదు ఓ స్మైలీ ఎమోజీని యాడ్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం: గోస్వామి