న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs DC:అతనే అర్హుడంటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పంచుకున్న కుల్దీప్ యాదవ్(వీడియో)

Kuldeep Yadav shares Player-of-the-Match award with Axar Patel in PBKS vs DC Match

ముంబై: తమ జట్టులో అరడజను మంది కరోనా బారిన పడినా.. ఇద్దరు ప్లేయర్ల సేవలు కోల్పోయినా.. అసలు మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వచ్చినా.. ఎక్కడా ఆ ఒత్తిడిని చూపెట్టని ఢిల్లీ క్యాపిటల్స్ గ్రౌండ్‌లో అదిరిపోయే పెర్ఫామెన్స్ చేసింది. బుధవారం జరిగిన ఏకపక్ష పోరులో క్యాపిటల్స్‌ 9 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది.

24 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. వాస్తవానికి 10 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసిన అక్షర్ పటేల్‌కు ఈ అవార్డు లభిస్తుందని అంతా భావించారు. పైగా అతను లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ వంటి కీలక వికెట్లను తీసాడు.

అక్షర్‌ను కాదని..

కానీ ఐపీఎల్ మేనేజ్‌మెంట్ మాత్రం ఒకే ఓవర్‌లో కగిసో రబడా, నాథన్ ఎల్లిస్ వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌కు ఎంపిక చేసింది. ఒకే ఓవర్‌లో ఈ ఇద్దరిని ఔట్ చేయడంతో ద్వారా స్లాగ్ ఓవర్లలో పంజాబ్ ధాటిగా ఆడలేక ఆలౌటయ్యిందనే పాయింట్‌లో ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న కుల్దీప్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ అవార్డుకు అక్షర్ పటేల్ అర్హుడని, అతని రెండు కీలక వికెట్లు తీసాడని చెప్పాడు. ఈ అవార్డును అతనితో కలిసి షేర్ చేసుకుంటానని తెలిపాడు.

అక్షర్‌తో పంచుకుంటా..

అక్షర్‌తో పంచుకుంటా..

'ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అక్షర్ పటేల్‌తో పంచుకోవాలనుకుంటున్నా. అతను అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీసాడు. నా దృష్టిలో ఈ అవార్డుకు అక్షర్ పటేలే అర్హుడు. అందుకే అతనితో పంచుకోవాలనుకుంటున్నా'అని అవార్డు అందుకుంటున్న సమయంలో కుల్దీప్ యాదవ్ తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 పంజాబ్ ఘోర పరాజయం..

పంజాబ్ ఘోర పరాజయం..

ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. యువ ప్లేయర్ జితేశ్ శర్మ(23 బంతుల్లో 5 ఫోర్లు 32), మయాంక్ అగర్వాల్(15 బంతుల్లో 4 ఫోర్ల‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలోకుల్దీప్‌ యాదవ్‌ (2/24), ఖలీల్‌ అహ్మద్‌ (2/21), అక్షర్‌ పటేల్‌ (2/10), లలిత్‌ యాదవ్‌ (2/11)రెండేసి వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 10.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 119 పరుగులు చేసి 57 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌‌తో 60 నాటౌట్), పృథ్వీ షా(20 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. రాహుల్ చాహర్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Thursday, April 21, 2022, 8:53 [IST]
Other articles published on Apr 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X