న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని వల్లే ఫాస్ట్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటున్నాం: కోహ్లీ

Virat Kohli Says India Batting Against Fast Bowling Has Improved Because of Throwdown Specialist Raghu

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ప్రత్యర్థి జట్ల ఫాస్ట్‌‌ బౌలింగ్‌‌ను ఎదుర్కొనే సత్తా తమకు బాగా పెరిగిందని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ తెలిపాడు. త్రోడౌన్‌‌ స్పెషలిస్ట్‌‌ రాఘవేంద్ర వల్లే ఇది సాధ్యమైందన్నాడు. అతను సైడ్‌‌ఆర్మ్‌‌ (క్రికెట్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌) తో 150, 150 కేఎంపీహెచ్‌‌ వేగంతో విసిరే బాల్స్‌‌ను సులువుగా ఎదుర్కొంటున్నామన్నాడు. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌తో మంగళవారం ఇన్‌స్టాలైవ్‌లో కోహ్లీ మాట్లాడాడు.

 రఘు వల్లే ఇదంతా..

రఘు వల్లే ఇదంతా..

‘2013 నుంచి మా బ్యాట్స్‌‌మెన్‌‌ ఫాస్ట్‌‌ బౌలింగ్‌‌ను చాలా బాగా ఎదుర్కొంటున్నారు. చాలా పురోగతి కనిపిస్తున్నది. దీనికి కారణం రఘు అని తెలుసు. ఫుట్‌‌వర్క్‌‌, ప్లేయర్ల బ్యాట్‌‌ మూమెంట్‌‌కు సంబంధించి అతని వద్ద మంచి కాన్సెప్ట్‌‌లు ఉన్నాయి. ఈ సైడ్‌‌ఆర్మ్‌‌ కాన్సెప్ట్‌‌తో బాల్‌‌ 155 కేఎంపీహెచ్‌‌ స్పీడ్‌‌తో వస్తుంది. నెట్స్‌‌లో రఘును ఎదుర్కొన్న తర్వాత మ్యాచ్‌‌ ఆడటానికి వెళ్తే బాల్‌‌ రావడానికి చాలా సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే చాలా ఏళ్లుగా రఘు.. మా సపోర్ట్‌‌ స్టాఫ్‌‌లో కీలక వ్యక్తి అనొచ్చు'అని కోహ్లీ పేర్కొన్నాడు.

నా సత్తాపై ఏనాడు అనుమానం రాలేదు..

నా సత్తాపై ఏనాడు అనుమానం రాలేదు..

తీవ్ర ఒత్తిడి ఉండే పెద్ద‌ ఛేజింగ్‌‌ మ్యాచ్‌‌ల్లో ఏనాడూ తన సత్తాపై అనుమానం‌ రాలేదన్నాడు. ‘నిజాయితీగా చెబుతున్నా.. మ్యాచ్‌‌ ఎలాంటి పరిస్థితు ల్లో ఉన్నా నా సత్తాపై అనుమానాలు రాలేదు. ప్రతి మనిషికి బలహీనతలు, సందేహాలు‌ ఉండటం సాధారణం. చెత్త ఆలోచనలు మైండ్‌‌లోకి వస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. అందుకే ఎప్పుడూ కాంపిటీషన్‌‌ మోడ్‌‌లో ఉండాలి. నేను బాగా ఆడతా అనే ఆలోచన వస్తే ఎంత పెద్ద టార్గెట్‌‌ అయినా సులువుగా ఛేదించవచ్చు'అని ఈ రన్ మిషన్ చెప్పాడు.

 చిన్నతనంలోనే ఫిక్సయ్యా..

చిన్నతనంలోనే ఫిక్సయ్యా..

చిన్నతనంలో భారత మ్యాచ్‌‌లు చూసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. తాను జట్టు‌ విజయానికి ఎలా సాయపడగలను అనుకుంటూ నిద్రపోయేవాడినన్నాడు. ‘380 లక్ష్యాన్ని చేధించినా నాకు పెద్దగా ఫీలింగ్‌‌ ఉండదు. ఎందుకంటే చిన్నప్పటినుంచి ప్రతి మ్యాచ్‌‌ గెలవాలనే కోరుకునేవాడిని. 2011 లో హోబర్ట్‌‌లో 40 ఓవర్లలోనే 340 లక్ష్యాన్ని ఛేదించాం. మన బ్యాటింగ్‌‌ అప్రోచ్‌‌ 20 ఓవర్ల మ్యాచ్‌‌లాగా ఉండాలని బ్రేక్‌‌లో రైనాకు చెప్పా. 40 ఓవర్లంటే లాంగ్‌‌ డ్యూరేషన్‌‌. తొలి 20 ఓవర్లలో ఎన్ని పరుగులు‌ చేస్తామో చూసి తర్వాతి 20 ఓవర్లను ఆడదామని చెప్పా'అని విరాట్‌‌ వ్యాఖ్యానించాడు.

ఛేజింగ్ కింగ్..

ఛేజింగ్ కింగ్..

సీబీ సిరీస్ 2012, ఆసియా కప్ 2012, 2013 ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌, 2014 అడిలైడ్ టెస్టు, 2016 టీ20 ప్రపంచకప్‌, 2019 ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో ఛేజింగ్ విరాట్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో ఛేజింగ్ కింగ్‌గా యావత్ క్రికెట్ ప్రపంచం మన్ననలు అందుకున్నాడు. ఇవే కాక టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

కోహ్లీ నుంచి అదో చెత్త ఫిర్యాదు.. అలాంటి బిత్తిరి మాటలు ఎక్కడా వినలేదు: బెన్ స్టోక్స్

Story first published: Wednesday, May 20, 2020, 9:35 [IST]
Other articles published on May 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X