న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రోహిత్ ఓకే.. కానీ, కోహ్లీ ఎవ్వరూ సాటిరారు'

Kohli is Kohli, but Rohit Sharma’s captaincy is growing every day: Waqar Younis

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో విజయం సాధించిన టీమిండియాపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ వకార్‌ యూనిస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లి గైర్హాజరీతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఇటీవల ప్రముఖ ఉర్దూ మీడియా ఖలీజ్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆసియాకప్‌ విజయంలో భారత ఓపెనర్ల కీలకపాత్ర పోషించారన్నాడు.

కోహ్లి.. విషయంలో ఎవరూ ఛాలెంజ్ చేయలేరు

కోహ్లి.. విషయంలో ఎవరూ ఛాలెంజ్ చేయలేరు

విరాట్‌ కోహ్లి.. అతనికి అతనే సాటి. అతని విషయంలో ఎవరూ ఛాలెంజ్ చేయలేరు. కానీ అతను లేకుండా భారత జట్టు ఆసియాకప్‌లో అదరగొట్టింది. విరాట్‌ మూడో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటాడు. కానీ ఆసియాకప్‌లో రోహిత్‌ అద్బుతంగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. మైదానంలో అతను చాలా ప్రశాంతంగా కనిపించాడు.

భారత్ Vs వెస్టిండిస్: నమోదయ్యే రికార్డులివే, కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి

రోజు రోజుకు కెప్టెన్సీ మెరుగవుతోంది:

రోజు రోజుకు కెప్టెన్సీ మెరుగవుతోంది:

అతని కెప్టెన్సీ రోజు రోజుకు మెరుగైంది. ఐపీఎల్‌లో కూడా అతని కెప్టెన్సీ చూశాను. ఆటగాళ్ల సొంత నిర్ణయాలను అనుమతిస్తాడు. వారికనుగుణంగా ఆడే స్వేచ్ఛను ఇస్తాడు. రోహిత్‌ ఓ అద్బుత కెప్టెన్‌.

భారత్ పట్ల ఆశ్చర్యానికి గురికాలేదు

భారత్ పట్ల ఆశ్చర్యానికి గురికాలేదు

భారత్‌ నైపుణ్యమున్న ఆటగాళ్లతో కూడిన జట్టు. ఈ జట్టులో వరల్డ్‌ క్లాస్‌ ఓపెనర్స్‌ ఉన్నారు. రోహిత్‌, ధావన్‌లు ప్రతిసారి మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పితే ప్రత్యర్థులకు కష్టంగా ఉంటుంది. భారత్ విజయాల పట్ల నేనేం ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే భారత్‌ ఓ పెద్ద దేశం. ఆదేశంలో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. దేశంలో ప్రతి ప్రాంతానికి క్రికెట్‌ విస్తరించింది.

ఐపీఎల్‌ ఎంతో మందిని పరిచయం

ఐపీఎల్‌ ఎంతో మందిని పరిచయం

భారత పేస్‌ బౌలర్లు సంపన్న కుటుంబాల నుంచి రాలేదు. వారంతా పేద కుటుంబాల నుంచి వచ్చారు. వారికి ఐపీఎల్‌ మంచి అవకాశాలను ఇచ్చింది. భారత్‌లో క్రికెట్‌ వేదికలు చాలా మార్పును తీసుకొచ్చాయి. ప్రత్యేకంగా ఐపీఎల్‌ ఎంతో మంది యువఆటగాళ్లను పరిచయం చేసింది. అని అంతర్జాతీయ క్రికెట్‌లో 789 వికెట్లు పడగొట్టిన యూనిస్‌ తెలిపాడు.

Story first published: Wednesday, October 3, 2018, 11:53 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X