న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మోడ్రన్ ఎరాలో గ్రేట్ ప్లేయర్: కోహ్లీపై కుంబ్లే ప్రశంసల వర్షం

Kohli has taken batting to the next level: Anil Kumble

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో గేమ్‌ను తదుపరి లెవెల్‌కు తీసుకెళ్లాడని అనిల్ కుంబ్లే కితాబిచ్చాడు. అనిల్ కుంబ్లే క్రికెట్ నెక్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మోడ్రన్ ఎరాలో విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయర్ అని కొనియాడాడు.

అశ్విన్, జడేజా లేకపోతే కుల్దీప్ ఉన్నాడుగా: జట్టు మేనేజ్‌మెంట్‌కు కుంబ్లేఅశ్విన్, జడేజా లేకపోతే కుల్దీప్ ఉన్నాడుగా: జట్టు మేనేజ్‌మెంట్‌కు కుంబ్లే

"ప్రతి గేమ్‌లోనూ విరాట్ కోహ్లీ తన నైపుణ్య స్థాయిని మెరుగుపరచుకోవడమే కాదు గేమ్‌ను తదుపరి లెవెల్‌కు తీసుకెళ్లాడు. చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులతో సంబంధం లేకుండా మానసిక సామర్ధ్యాలను సైతం తన అదుపులో ఉంచుకున్నాడు. తన బ్యాటింగ్‌తో జట్టుని ముందుండి నడిపిస్తున్న తీరుని మీరు గమనించవచ్చు. ఆటలో సైతం ఎంతో పరిణితిని కనబరుస్తున్నాడు. పేలవషాట్లను ఆడటం లేదు. 20, 30 పరుగులను దాటాడంటే దానిని సెంచరీగా మలుస్తున్నాడు" అని అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చాడు.

కోహ్లీ గ్రేట్ ప్లేయర్

కోహ్లీ గ్రేట్ ప్లేయర్

గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతీరుని కనబరుస్తున్నాడు. ఆరంభంలో నిలకడగా ఆడుతూ ఆ తర్వాత వాటిని భారీ స్కోర్లుగా మలుస్తున్న తీరు అద్భుతం. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు సైతం కోహ్లీ నుంచి దీనిని నేర్చుకోవాలి, ముఖ్యంగా రహానే. మురళీ విజయ్ చక్కటి ఆరంభాన్ని ఇస్తున్నప్పటికీ, దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమవుతున్నాడు. అదే కోహ్లీ విషయానికి వస్తే నిలకడగా క్రీజులో పాతుకుపోయి జట్టుని చక్కటి స్థితిలో ఉంచుతున్నాడు. ఇదే కేవలం స్కిల్‌తోనే సాధ్యం కాదు మానసిక సామర్ధ్యం కూడా ఎంతో అవసరం" అని కుంబ్లే అన్నాడు.

కోహ్లీ-సచిన్ టెండూల్కర్‌ పోలికపై

కోహ్లీ-సచిన్ టెండూల్కర్‌ పోలికపై

ఈ ఇద్దరిని ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. వీరిద్దరూ ఆడుతోన్న తరాలు వేరు, కాబట్టి పోల్చకూడదు. ఏది ఏమైనప్పటికీ విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయర్. ప్రస్తుతం కోహ్లీ 60 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. చాలా తక్కువ సమయంలో వీటిని సాధించాడు. పరుగుల పట్ల ఆకలిగా ఉన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. ప్రతి ఒక్కటీ కౌంట్ అవుతోంది. అంతటి సామర్థ్యం కోహ్లీకి ఉంది. మోడ్రన్ ఎరాలో విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయర్.

మూడో టెస్టులో హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించడంపై

మూడో టెస్టులో హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించడంపై

ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలంటే హార్దిక్ పాండ్యా నాలుగో పేసర్‌గా తుది జట్టులోకి సరిగ్గా సరిపోతాడు. ఇదొక్కటే ఏకైక ఆప్షన్. అదే పాండ్యాను మూడో ఫాస్ట్ బౌలర్‌గా పరిగణిస్తే, ఇందుకు నేను అంగీకరించను. అందుకు కారణం పాండ్యాకు చాలా తక్కువ సమయం ఉండటమే. అదే అశ్విన్, జడేజా ఫిట్‌గా ఉంటే ఇద్దరు స్పిన్నర్లతో వెళితే మంచిది. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ గాయాల నుంచి ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి సందర్భంలో కుల్దీప్ యాదవ్ జట్టు మేనేజ్‌మెంట్‌కు అందుబాటులో ఉన్నాడు. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో తాను ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో మనకు తెలిసిందే. దీంతో మెల్ బోర్న్ టెస్టుకు టీమిండియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి. ఈ సిరిస్‌లో పేసర్లు చక్కటి ప్రదర్శన చేస్తున్నారు.

రహానేపై ఇలా

రహానేపై ఇలా

రహానే క్వాలిటి ప్లేయర్. అందుకే అతడితో మిడిలార్డర్‌ను టాంపర్ చేయాలని అనుకోను. పుజారాని మూడో స్థానంలో, కోహ్లీని నాలుగు స్థానంలో, రహానేని ఐదో స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్‌కు పంపుతా. బ్యాటింగ్ ఆర్డర్‌లో పుజారాను ముందు పంపడం ద్వారా అతడిలో ప్రేరణను కలిగిస్తుంది. ఈ సిరిస్‌లో ఇప్పటికే రహానే జట్టుకు చక్కటి భాగస్వామ్యాలను నమోదు చేశాడు. అయితే, ఇంకా అతడు కాస్త దూకుడుగా ఆడితే బాగుటుందనేది నా అభిప్రాయం. రహానే చక్కటి స్టోక్ ప్లేయర్ కూడా. క్రీజులో పాతుకుపోయాడంటే రహానే బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది.

Story first published: Monday, December 24, 2018, 14:05 [IST]
Other articles published on Dec 24, 2018
Read in English: Kohli gets Kumble pat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X