న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత క్రికెట్‌లో అత్యుత్తమం అయ్యే సత్తా కేఎల్ రాహుల్‌కే ఉంది'

KL Rahul has the capability of becoming the next big thing in Indian cricket: Sunil Gavaskar

హైదరాబాద్: భారత క్రికెట్‌లో మున్ముందు అత్యుత్తమ క్రికెటర్‌గా మారగలిగే సత్తా కేఎల్‌ రాహుల్‌కు ఉందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అన్నాడు. 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లు పాండ్యా, రాహుల్‌లు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

కివీస్ టూర్‌ను క్లిష్టమైన పర్యటనగా అభివర్ణించిన కోహ్లీకివీస్ టూర్‌ను క్లిష్టమైన పర్యటనగా అభివర్ణించిన కోహ్లీ

తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గవాస్కర్ మాట్లాడుతూ "పేలవ టెక్నిక్‌, మానసికంగా రాహుల్‌ ఇబ్బంది పడుతున్నాడు. పరుగులు చేయకపోవడంతో ఆత్మవిశ్వాసం కొరవడింది. గతంలోనే చెప్పాను. అతడు భారత క్రికెట్‌లో అత్యుత్తమంగా మారతాడు" అని అన్నాడు.

"బ్యాటింగ్‌ సహా అతడిని వెనక్కి లాగుతున్న అంశాలపై దృష్టి సారిస్తే అత్యుత్తమం అయ్యే సత్తా ఉందని నేనిప్పటికీ నమ్ముతున్నా. అతడి కదలికలపై ఆలోచించాలి. సచిన్‌ కాస్త ముందుకు జరిగి ఆడతాడు. మరీ ముందుకు కాదు. పక్కకు కాదు. అందుకే ముందుకూ, వెనక్కీ అవసరం మేరకు రాగలుగుతాడు" అని గవాస్కర్ తెలిపాడు.

"రాహుల్‌ పరిస్థితి అలా లేదు. అతడు అడుగు వెనక్కి వేసినప్పుడు అవసరమైతే మళ్లీ ముందుకు రాలేకపోతున్నాడు. అతడి గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు జరగడంతో బంతిని ఆలస్యంగా ఆడలేకపోతున్నాడు" అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా, హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ల భవితవ్యం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు.

'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిద్దరిపై విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకునేందుకు వెంటనే అంబుడ్స్‌మన్‌ను నియమించాలని బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటికిప్పుడు అంబుడ్స్‌మన్‌ను నియమించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 23, 2019, 9:16 [IST]
Other articles published on Jan 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X