న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs PBKS Dream11: డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! పిచ్ అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్!!

KKR vs PBKS Dream11 Prediction: Captain, Vice-Captain Tips And Head to Head Records For Match 45

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో హోరాహోరీ పోరుకు సమయం దగ్గరపడుతోంది. శుక్రవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో అమీతుమీ తేల్చుకునేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పంజాబ్, కోల్‌కతా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. లైవ్ స్ట్రీమింగ్ డిస్ని ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచును చూడొచ్చు.

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా.. రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. ఇప్పటివరకు కోల్​కతా 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచింది. 10 పాయింట్లతో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉంది. దాంతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్​లో విజయం సాధించడం చాలా అవసరం. దీంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా కోల్​కతా నైట్​రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్​కతా 19 సార్లు గెలుపొందగా.. పంజాబ్ 9 మాత్రమే విజయాలు అందుకుంది. పంజాబ్ జట్టుపై కోల్​కతా చేసిన అత్యధిక స్కోర్ 245 కాగా.. కోల్​కతాపై పంజాబ్ 214 రన్స్ చేసింది. పంజాబ్ జట్టుపై కోల్​కతా చేసిన అత్యల్ప స్కోర్ 109 కాగా.. కోల్​కతాపై పంజాబ్ 19 రన్స్ చేసింది. మ్యాచుకు ఎలాంటి వర్షం ముప్పులేదు. ఉష్ణోగ్రత 33 ° Cగా ఉండనుంది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైంది. ఇక్కడి పిచ్ బ్యాటర్‌లకు మరోసారి సహాయపడనుంది. మ్యాచ్ చివరి భాగంలో పేసర్లకు అనుకూలంగా ఉండనుంది. ఇక స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో చెలరేగే అవకాశం ఉంది.

డు ఆర్ డై మ్యాచ్

డు ఆర్ డై మ్యాచ్

కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ రేసులో ఉండటానికి 'ఇది డు ఆర్ డై' మ్యాచ్ కానుంది. ఐపీఎల్ 2021లో అంతగా ఆకట్టుకోని కింగ్స్.. ఇప్పటికైనా వరుస విజయాలు అందుకోవాల్సిన సమయం వచ్చింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇప్పటివరకు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడలేదు. గత సీజన్లో పరుగుల వరద పారించిన రాహుల్.. ఈసారి ఆ ఫామ్ కొనసాగించలేదు. ఇప్పుడు పంజాబ్ జట్టుకు విజయం తప్పనిసరి.

ఈ నేపథ్యంలో రాహుల్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక గాయపడిన మయాంక్ అగర్వాల్ స్థానంలో ముంబైపై ఆడిన మన్​దీప్ సింగ్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. 14 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే మయాంక్ ఫిట్‌నెస్‌ సాధించడంతో ఈరోజు మ్యాచ్ ఆడనున్నాడు.

 గేల్‌ ఔట్

గేల్‌ ఔట్

బయో బబుల్‌ కారణంగా ఐపీఎల్ 14 నుంచి తప్పుకుంటున్నట్లు యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ ప్రకటించాడు. దాంతో కోల్​కతాతో జరిగే మ్యాచుకు గేల్‌ అందుబాటులో ఉండడం లేదు. గేల్‌ స్థానంలో మన్​దీప్ సింగ్ ఆడనున్నాడు. స్టార్ హిట్టర్ నికోలస్ పూరన్, దీపక్ హుడా కూడా విఫలమవుతున్నారు. దీంతో మంచి శుభారంభం లభిస్తున్నా చివర్లో చతికిలపడుతోంది పంజాబ్. ఇడెన్ మర్క్​రమ్ కూడా పెద్దగా ప్రభావం చూపకున్నా.. అతడికి మరో ఛాన్స్ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం పంజాబ్ జట్టుకు మిడిలార్డర్ సమస్య పెద్ద సమస్యగా మారింది. ఇది అధిగమిస్తే కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. బౌలింగ్​లోనూ రవి బిష్ణోయ్ తప్ప ఎవరూ అనుకున్నంతగా రాణించలేకపోతున్నారు. మొహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ వికెట్లు సాధిస్తున్నా.. చివర్లో ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నారు. హర్​ప్రీత్ బ్రర్ మెరుపులు ఒక మ్యాచుకే పరిమితం అయ్యాయి.

IPL 2021: సీఎస్‌కే 10 మంది ఆటగాళ్లతో మాత్రమే ఆడుతోంది.. ఆ ప్లేయర్ ఉన్నా లేనట్టే: ఆకాశ్ చోప్రా

వెంకటేశ్ మెరిసేనా

వెంకటేశ్ మెరిసేనా

ఇక కోల్​కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. బ్యాటింగ్​లో యువ ఓపెవర్ వెంకటేశ్ అయ్యర్​ మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. రెండో దశలో మొదటి రెండు మ్యాచుల్లో అదరగొట్టాడు. ఆ తర్వాత మాత్రం విఫలయినా.. ఈ మ్యాచులో అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మాత్రం అంచనాలను అందుకోవట్లేదు.

రాహుల్ త్రిపాఠి బ్యాట్ జుళిపిస్తున్నాడు. త్రిపాఠితో పాటు నితీశ్ రానా, కెప్టెన్ మోర్గాన్, దినేష్ కార్తీక్ బ్యాట్​కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. బౌలింగ్​లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడిచేస్తున్నారు. టీమ్ సౌథీ, లుకీ ఫెర్గుసన్, సందీప్ వారియర్ రాణించాల్సిన అవసరం ఉంది.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

పంజాబ్ కింగ్స్: లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మన్​దీప్ సింగ్, ఇడెన్ మర్క్​రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్​ప్రీత్ బ్రర్, నాథన్ ఎల్లిస్, మొహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.

కోల్​కతా నైట్​రైడర్స్: శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), నితీశ్ రానా, దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, లుకీ ఫెర్గుసన్, సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి.

 డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

లోకేష్ రాహుల్, ఐడెన్ మార్క్రామ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, మహ్మద్ షమీ (వైస్ కెప్టెన్), అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Friday, October 1, 2021, 15:45 [IST]
Other articles published on Oct 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X