న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR v SRH: 'అతడు లేకుండా సన్‌రైజర్స్ 180 రన్స్ చేయడం కష్టం.. 140 పరుగులు మాత్రమే వస్తాయి'

KKR v SRH: Aakash Chopra wondered why Sunrisers Hyderabad did not play Kane Williamson if he was fit

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజ‌న్‌-13లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌‌) వరుస‌గా తొలి రెండు మ్యాచ్‌ల‌లో ఓటమిపాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌‌లో 10 పరుగుల తేడాతో ఓడిన ఎస్‌ఆర్‌హెచ్‌‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఎస్‌ఆర్‌హెచ్‌‌ రెండు మ్యాచ్‌ల‌లో కూడా బ్యాటింగ్ విభాగంలోనే విఫలమైంది. మొదటి మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో, రెండో మ్యాచ్‌లో మనీష్ పాండే హాఫ్ సెంచరీలు చేయగా.. మిగతా బ్యాట్స్‌మెన్ ఆతట్టుకోలేకపోయారు.

బలంగా లేని మిడిలార్డర్

బలంగా లేని మిడిలార్డర్

రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మిడిలార్డర్ బలంగా లేదని నిరూపితమైంది. బెంగళూరు మ్యాచులో డేవిడ్ వార్నర్ త్వరగా పెవిలియన్ చేరగా.. జానీ బెయిర్‌‌స్టో (61) హాఫ్ సెంచరీ చేశాడు. మనీష్ పాండే (34) పర్వాలేదనిపించాడు. ఇద్దరూ కీలక సమయంలో ఔట్ కావడంతో.. గెలవాల్సిన మ్యాచును సన్‌రైజర్స్ ఓడిపోయింది. ఇక కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెయిర్‌‌స్టో తర్వగా ఔటవగా.. వార్నర్ కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. పాండే హాఫ్ సెంచరీ చేసినా.. సాహా దూకుడుగా ఆడలేకపోయాడు. దీంతో సన్‌రైజర్స్ 142 పరుగులకే పరిమితమై.. మరోసారి గెలవాల్సిన మ్యాచులో ఓడిపోయింది.

కేన్ లేని లోటు

కేన్ లేని లోటు

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ లేని లోటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కేన్ ఫిట్‌గా ఉంటే.. సన్‌రైజర్స్ యాజమాన్యం అతడిని ఆడించాలని సూచించాడు. 100% ఫిట్‌గా లేకపోవడంతో బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన కేన్.. రెండో మ్యాచ్‌ (కోల్‌కతా)కు సైతం దూరమయ్యాడు. అయితే కెప్టెన్ డేవిడ్ వార్నర్ కేన్ ఫిట్‌నెస్‌ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇక మ్యాచ్ మధ్యలో ఇంటర్వ్యూ ఇచ్చిన విలియమ్సన్ కూడా తన గాయం గురించి మాట్లాడలేదు.

విలియమ్సన్‌ను ఆడించేలా ప్లాన్ చేయాలి

విలియమ్సన్‌ను ఆడించేలా ప్లాన్ చేయాలి

ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ షో తాజా ఎపిసోడ్‌లో మాట్లాడుతూ... 'మిచెల్ మార్ష్ లేడు కాబట్టి మొహమ్మద్ నబీ మ్యాచ్ ఆడాడు. ఇది బాగానే ఉంది. కేన్ విలియమ్స్ ఫిట్‌గా కనిపించాడు. ఎందుకంటే మిడ్ మ్యాచ్ ఇంటర్వ్యూలో అతను గాయపడినట్లు ఎప్పుడూ చెప్పలేదు. విలియమ్సన్ ఫిట్‌గా, అందుబాటులో ఉంటే ఎందుకు ఆడడు' అని ప్రశ్నించాడు. విలియమ్సన్‌ను ఆడించేలా సన్‌రైజర్స్ ప్లాన్ చేయాలి. అతడు లేకుండా జట్టు బ్యాటింగ్ విభాగం బలంగా లేదు. కేన్ లేకుండా 180 రన్స్ చేయడం కష్టం.. 140 పరుగులు మాత్రమే వస్తాయి' అని పేర్కొన్నాడు.

 బౌలింగ్ విషయంలోనూ ఇబ్బందులు

బౌలింగ్ విషయంలోనూ ఇబ్బందులు

'బౌలింగ్ విషయంలో సన్‌రైజర్స్ ఇబ్బందులు పడుతోంది. భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ గతంలో మాదిరిగా ఆడలేకపోతున్నారు. వేరే ప్రత్యామ్నాయం లేకపోతే సన్‌రైజర్స్ బలహీన జట్టుగా మారుతుంది. ఇప్పటికే రెండు పరాజయాలు చవిచూసింది. ఇప్పటికైనా సరైన జట్టును ఎంచుకోవాలి. సన్‌రైజర్స్ చివరి 4 స్థానాల్లో ఉండేలా కన్పిస్తోంది' అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన.. విలియమ్సన్ లాంటి ఆటగాడిని హైదరాబాద్ పక్కన బెట్టాల్సి వస్తోంది. బెయిర్‌స్టో, వార్నర్‌, రషీద్ ఖాన్ తుది జట్టులో ఉండటం ఖాయం. ఇక నాలుగో ఆటగాడి విషయంలోనే ఎటూ తేల్చుకోలేకపోతోంది.

KKR v SRH: 'కేవలం ఒక్క డకౌట్‌తో.. నేనేం చెడ్డ ఆటగాడిని కాను'

Story first published: Sunday, September 27, 2020, 16:08 [IST]
Other articles published on Sep 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X